హైదరాబాద్ అందుకే మునిగింది? ముంపుకు కారకులెవరు?

ప్రకృతి మనిషికి బతకడానికి అవకాశం కల్పించింది. గాలి, నీరు, ఆహారం, సహజసిద్ధమైన ప్రకృతి సంపద.. జంతుజాలం ఇలా అన్నీ కలగలిపి భూమిపై ప్రాణుల మనుగడకు తోడ్పడింది. కానీ మనిషే.. స్వార్థంతో వాటన్నింటిని నాశనం చేస్తూ ఇప్పుడు ఆ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు.. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను.. దాన్ని ఎందుకు పరిరక్షించుకోవాలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన ‘కరోనా వైరస్’ నేర్పించింది. ప్రకృతిని నాశనం చేస్తే అది పగబడుతుందని మనిషికి అర్థమయ్యేలా ఇప్పుడు విజృంభిస్తోంది. అలాగే ప్రకృతి సంపద […]

Written By: NARESH, Updated On : November 4, 2020 10:51 am
Follow us on

ప్రకృతి మనిషికి బతకడానికి అవకాశం కల్పించింది. గాలి, నీరు, ఆహారం, సహజసిద్ధమైన ప్రకృతి సంపద.. జంతుజాలం ఇలా అన్నీ కలగలిపి భూమిపై ప్రాణుల మనుగడకు తోడ్పడింది. కానీ మనిషే.. స్వార్థంతో వాటన్నింటిని నాశనం చేస్తూ ఇప్పుడు ఆ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు.. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను.. దాన్ని ఎందుకు పరిరక్షించుకోవాలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన ‘కరోనా వైరస్’ నేర్పించింది. ప్రకృతిని నాశనం చేస్తే అది పగబడుతుందని మనిషికి అర్థమయ్యేలా ఇప్పుడు విజృంభిస్తోంది. అలాగే ప్రకృతి సంపద అయిన చెరువులు, అడవులు, సహజంగా ఏర్పడిన కాలువలను కూడా మనిషి స్వార్థానికి ఆక్రమించుకున్నాడు. దీంతో హైదరాబాద్ తాజాగా మునిగింది. ఒకప్పుడు లేక్ ఆఫ్ సిటీగా హైదరాబాద్ ను చెప్పుకునేవారు. గొలుసుకట్టు చెరువులతో హైదరాబాద్ చుట్టుపక్కల ఆహ్లాదంగా ఉండేది. 1965నాటి శాటిలైట్ చిత్రంలో అది స్పష్టంగా కనిపించింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

1965 నాటి హైదరాబాద్ కు ఇప్పటి హైదరాబాద్ కు చాలా తేడా ఉంది. తాజాగా బయటపడ్డ నాటి-నేటి శాటిలైట్ చిత్రాలు చూస్తే నిజంగానే హైదరాబాద్ లో ఎంత కబ్జాలు జరిగాయో తేటతెల్లమవుతుంది.1965లో ఎల్బీనగర్, సరూర్ నగర్, పరిసర ప్రాంతాల 1965 నాటి శాటిలైట్ చిత్రం తాజాగా బయటపడింది. సరూర్ నగర్, మీర్ పేటలోని మంత్రుల చెరువు, చందన చెరువులను అనుసంధానిస్తూ నాలా స్పష్టంగా కనిపిస్తోంది. నాగోల్సాయినగర్, పెద్ద చెరువులూ గొలుసుకట్టుగా ఉన్నాయని చిత్రంలో చూపిస్తోంది.

Also Read: దుబ్బాకలో బీజేపీ వేవ్.. గెలిచేస్తోందా?

ఇక ఇప్పుడు అక్టోబర్ లో శాటిలైట్ చిత్రం బయటపడింది. అందులో చెరువులే లేకుండా పోయాయి. విస్తీర్ణం తగ్గిపోయింది. వాటికి అనుసంధానంగా అప్పుడు ఉన్న నాలాలు ఏవీ లేవు. ఇంత భారీగా కబ్జా చేశాక వరద ఎటు పోతుంది. అందుకే హైదరాబాద్ ను ముంచెత్తింది. ఇది ప్రజలు, పాలకులు చేసుకున్న పాపం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రకృతితో ఆటలాడితే పరిస్థితి ఇలానే ఉంటుంది.

Also Read: దుబ్బాక ఎగ్జిట్ పోల్: ఎవరిది గెలుపంటే?

హైదరాబాద్ వరదలకు కారకులెవరనే ప్రశ్నకు ఈ నాటి-నేటి శాటిలైట్ చిత్రాలే ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వాలు, అధికారులు , ప్రజలు ముగ్గురు ఎవరి అవసరార్థం వారు డబ్బులు వెదజల్లో.. ఓటు బ్యాంకు రాజకీయాలో.. లేక కోట్ల విలువైన భూమి అనో మొత్తానికి కబ్జా చేసేశారు. అయితే ఆ పాపం ఊరికే పోతుందా? ఇప్పుడు చూపిస్తోంది. హైదరాబాద్ లో ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులు.. వాటికి అనుసంధానంగా కాలువలు.. నాలాలు ఉండేవి. నాటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం.. నేతలు కబ్జా చేయడం.. ప్రజలు కూడా నాలాలు కబ్జా చేసి కట్టుకున్నారు. దీంతో భారీవర్షాలకు ఆ వరదనీరు ఎటు పోవాలో తెలియక.. చెరువులకు చేరే మార్గం లేక నాలాలు, కాలువలు లేక ఇళ్లను ముంచెత్తుతుంది. దీనికి అందరూ బాధ్యులే.. అందుకే అందరూ అనుభవించాల్సిందే.!