ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన హెచ్‌సీఎల్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా, లాక్ డౌన్ సమయంలో దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సాఫ్ట్ వేర్ కంపెనీలకు సైతం నష్టాలు తగ్గుతున్నాయి.
Also Read: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇకపై వర్క్ ఫ్రమ్ హోం లేదట..!
హెచ్‌సీఎల్ సీహెచ్‌ఆర్ఓ వి. అప్పారావు కొత్తగా 7,000 నుంచి 9,000 మంది ఉద్యోగులను నియమించాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 1,000కు పైగా ఉద్యోగులు ఇప్పటికే హెచ్‌సీఎల్ నియమించుకుంది. మరోవైపు హెచ్‌సీఎల్ సెప్టెంబర్ నెలలో విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి వృద్ధి సాధించింది. రాబోయే త్రైమాసిక ఫలితాల్లో సైతం భారీస్థాయిలో వృద్ధి నమోదవుతుందని హెచ్‌సీఎల్ భావిస్తోంది.
కంపెనీ లాభాల దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రెషర్లకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా కంపెనీకి మరింత ప్రయోజనం చేకూరడంతో పాటు మెరుగైన ఫలితాలను నమోదు చేయవచ్చని సంస్థ భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం కంపెనీ శుభవార్త చెప్పింది. దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులకు కంపెనీ ఇంక్రిమెంట్లు ఇవ్వనుందని తెలుస్తోంది.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త… ఏపీలో 575 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు..?
సీఈఓ సి. విజయ్ కుమార్ గతేడాది అమలు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా కంపెనీలో ఇంక్రిమెంట్లను అమలు చేయనున్నామని తెలిపారు. మొదట ఈ3 స్థాయి ఉద్యోగులకు ఆ తర్వాత ఈ4, పై స్థాయి ఉద్యోగులకు కంపెనీ ఇంక్రిమెంట్లు ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం హెచ్‌సీఎల్ సంస్థలో లక్షన్నరకు పైగా ఉద్యోగులు పని చేస్తుండగా కొత్త నియామకాలతో ఆ సంఖ్య మరింత పెరగనుంది.