https://oktelugu.com/

చంద్రబాబుకు ఇంతకంటే అవమానం ఉండదేమో?

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ జోష్ మీద ఉంది. మొదటి నుంచి పంచాయతీ ఎన్నికలు వద్దంటున్న టీడీపీ మాత్రం పట్టుబట్టి మరీ ఎన్నికలు జరిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ ఏ ఎన్నికలైనా విజయం తమదే అన్నట్లు గ్రామాల్లో వైసీపీ జెండా రెపరెపలాడుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో వైసీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. Also Read: జగన్ కరుణించే ఆ ఆరుగురు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2021 / 09:04 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ జోష్ మీద ఉంది. మొదటి నుంచి పంచాయతీ ఎన్నికలు వద్దంటున్న టీడీపీ మాత్రం పట్టుబట్టి మరీ ఎన్నికలు జరిపిస్తోందని ఫ్యాన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ ఏ ఎన్నికలైనా విజయం తమదే అన్నట్లు గ్రామాల్లో వైసీపీ జెండా రెపరెపలాడుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో వైసీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

    Also Read: జగన్ కరుణించే ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరో..?

    ఇక నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా  చంద్రబాబు సొంత గ్రామమైన నారావారి పల్లెలో పోలింగ్ జరగనుంది. ఈ గ్రామంలో వైసీపీ జెండా ఎగురవేస్తుందా..? టీడీపీ తన బలం నిరూపించుకుంటుందా..? అనే చర్చ సాగుతోంది.

    చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఆ పార్టీ అధినేతను ఆందోళన పెట్టిస్తున్నాయి. ఈ నియోజకర్గంలోని 89 పంచాయతీలు ఉండగా మూడో దశ ఎన్నికల్లో వైసీపీ 75చోట్ల విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో చిత్తూరు జిల్లాలోని టీటీడపీ నాయకులు అవాక్కయ్యారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే సైకిల్ పార్టీకి మరో తలనొప్పి ఎదురవుతోంది.

    Also Read: హైఅలెర్ట్: మారిన వాతావరణం.. విస్తరిస్తున్న కరోనా

    టీడీపీ అధినేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెపై వైపీపీ ఫోకస్ పెట్టింది. ఈ గ్రామంలో ఎలాగైనా టీడీపీ గెలవాలని తమ్ముళ్లు ఆరాటపడుతున్నారట. అటు కందులవారిపల్లె సైతం టీడీపీకి కంచుకోట. ఇప్పటి వరకు ఈ గ్రామాంలో ప్రభాకర్ నాయుడు, బెనర్జీ నాయుడు, చంద్రకుమార్ నాయుడులు టీడీపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీ ఈ గ్రామంలో జెండా ఎగురవేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

    నారావారిపల్లె, శేషాపురం, బి.కొంగలవారిపల్లె గ్రామాలు కలిపి 1404 ఓట్లు ఉన్నాయి. వీటికి నాలుగోవిడత లో ఎన్నికలు జరగనున్నాయి.  వైసీపీ ఎస్సీ మహిళకు అవకాశం ఇవ్వగా.. టీడీపీ ఓసీ మహిళను బరిలోకి దింపుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో చాలా గ్రామాలు కైవలం చేసుకున్న లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇక టీడీపీ కంచుకోటపై దృష్టి పెట్టారట. మరి తెలుగు తమ్ముళ్లే ఏ విధంగా కష్టపడుతారో చూడాలి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్