రైతులకు అలర్ట్.. ఈ పంట వేస్తే లక్షల్లో సంపాదన మీ సొంతం..!

దేశంలో కరోనా కారణంగా కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పట్లో కొత్త ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా మారింది. దేశంలో కరోనా నిబంధనలు, లాక్ డౌన్ వల్ల ప్రైవేట్ కంపెనీలలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను తగ్గించాయి. అయితే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, ఇప్పటీకే వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవాళ్లు కొన్ని రకాల పంటలను వేయడం ద్వారా సులువుగా ఆదాయం పొందవచ్చు. Also Read: ఐదుగురు అన్నాదమ్ములకు ఒక్కరే భార్య.. ఎక్కడంటే..? కొన్ని పంటలను […]

Written By: Navya, Updated On : November 28, 2020 1:05 pm
Follow us on

దేశంలో కరోనా కారణంగా కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పట్లో కొత్త ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా మారింది. దేశంలో కరోనా నిబంధనలు, లాక్ డౌన్ వల్ల ప్రైవేట్ కంపెనీలలో మెజారిటీ కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను తగ్గించాయి. అయితే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు, ఇప్పటీకే వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవాళ్లు కొన్ని రకాల పంటలను వేయడం ద్వారా సులువుగా ఆదాయం పొందవచ్చు.

Also Read: ఐదుగురు అన్నాదమ్ములకు ఒక్కరే భార్య.. ఎక్కడంటే..?

కొన్ని పంటలను పండిస్తే వ్యవసాయం ద్వారా కూడా అదిరిపోయే లాభాలను సులువుగా సొంతం చేసుకోవచ్చు. తక్కువ సమయంలో వ్యవసాయం చేసి లాభాలను పొందాలనుకునే వాళ్లకు బఠానీ పంట మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పంటకు పెట్టుబడి తక్కువగా ఉండటంతో పాటు అదే సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో రైతులు బఠానీ పంటను పండిస్తారు.

Also Read: వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్లకు బఠానీ పంటను పండించడం ద్వారా అదిరిపోయే లాభాలు సొంతమవుతాయి. అయితే బఠానీ పంటలో వేర్వేరు రకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ప్రజలు వినియోగించే బఠానీ పంటను పండించడం ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో బఠానీ గింజల ధర కిలో 60 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పలుకుతోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

చలికాలం ఈ పంటను పండించడానికి అనువైన సమయమని చెప్పవచ్చు. పెద్దగా వాటర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో సైతం ఈ పంటను పండించడం సాధ్యమవుతుంది. 30 నుంచి 40 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది కాబట్టి తక్కువ సమయంలోనే సులభంగా లక్షల రూపాయల ఆదాయం సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.