https://oktelugu.com/

మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి ధర మాత్రం..?

కరోనా వ్యాక్సిన్ గురించి గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వరుస శుభవార్తల వల్ల పసిడి ధర క్రమంగా తగ్గుతోంది. ఆగష్టు నెలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 59,000 మార్కును దాటగా మూడు నెలల్లో బంగారం ధర ఏకంగా 9,000 రూపాయలు తగ్గడం గమనార్హం. గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది. బంగారం ధరతో పాటు వెండి ధర సైతం తగ్గడం గమనార్హం. Also Read: బంగారం […]

Written By: , Updated On : November 28, 2020 / 09:49 AM IST
Follow us on

Gold rate
కరోనా వ్యాక్సిన్ గురించి గత కొన్ని రోజులుగా వెలువడుతున్న వరుస శుభవార్తల వల్ల పసిడి ధర క్రమంగా తగ్గుతోంది. ఆగష్టు నెలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 59,000 మార్కును దాటగా మూడు నెలల్లో బంగారం ధర ఏకంగా 9,000 రూపాయలు తగ్గడం గమనార్హం. గత కొన్ని రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా తాజాగా బంగారం ధర మళ్లీ తగ్గింది. బంగారం ధరతో పాటు వెండి ధర సైతం తగ్గడం గమనార్హం.

Also Read: బంగారం ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం ధరలు..?

హైదరాబాద్ మార్కెట్ లో నిన్న బంగారం రేటు స్వల్పంగా పెరగగా ఈరోజు మాత్రం పసిడి ధర మళ్లీ తగ్గింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గడం గమనార్హం. బులియన్ మార్కెట్ నిపుణులు బంగారం, వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కొనుగోళ్లు గతంతో పోలిస్తే భారీగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర ఏకంగా రూ.180 తగ్గడంతో 49,580 రూపాయలకు చేరింది.

Also Read: భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి మాత్రం..?

22 క్యారెట్ల బంగారం ధర కూడా ఏకంగా 160 రూపాయలు తగ్గడంతో 45,450 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్ లో సైతం ధరలు తగ్గుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో బంగారం ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అయితే ధర ఖచ్చితంగా తగ్గుతుందో లేదో చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

వెండి ధర సైతం ఏకంగా 100 రూపాయలు తగ్గడంతో కేజీ వెండి ధర ఏకంగా 64,700 రూపాయలకు చేరింది. నాణేల తయారీదారుల నుంచి, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 1783 డాలర్లుగా ఉండగా వెండి ధర 22.28 డాలర్లుగా ఉంది.