https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’కు అదనపు హంగులు అందుతున్న జక్కన్న.!

టాలీవుడ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయచ్చని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’ సిరీసులతో తెలుగు సినిమా స్టామినా ఎలా ఉంటుందనేది చిత్రసీమలోని ప్రతీఒక్కరికీ రుచిచూపించాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. Also Read: విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘ఎనిమీ’ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 10:31 AM IST
    Follow us on

    టాలీవుడ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేయచ్చని నిరూపించిన దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’ సిరీసులతో తెలుగు సినిమా స్టామినా ఎలా ఉంటుందనేది చిత్రసీమలోని ప్రతీఒక్కరికీ రుచిచూపించాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అదిరిపోయే సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

    Also Read: విశాల్‌, ఆర్యల భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘ఎనిమీ’

    ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రిలీజైన రెండు టీజర్లు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరోనాతో ఈ మూవీ షూటింగు నిలిచిపోగా ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.

    ఇక ‘ఆర్ఆర్ఆర్’పై రాజమౌళి మార్క్ పబ్లిసిటీ షూరు అయింది. నిత్యం ఏదో ఒక అంశంతో ‘ఆర్ఆర్ఆర్’ వార్తల్లో నిలుస్తోంది. దీనికితోడు రాజమౌళి సినిమాకు అదనపు హంగులను అద్దుతుండటం ఆసక్తిని రేపుతోంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి, ఇతర ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లను రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో భాగస్వామ్యం చేయనున్నాడట. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

    Also Read: హిందీ రాదు.. హిందీ సినిమా తీస్తాడా ?

    ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమురంభీంగా.. రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా నటిస్తున్నారు. వీరి పాత్రలను పరిచయం చేసేందుకు ఇండస్ట్రీలోని సూపర్ స్టార్లను రాజమౌళి రంగంలోకి దింపుతూ సినిమా బిజినెస్ మరింత పెంచుతున్నాడు. హిందీ వర్షన్ కు అమీర్ ఖాన్.. తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి.. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ లేదా మ‌మ్ముట్టి తో వాయిస్ ఓవ‌ర్ చెప్పించనున్నారని టాక్ విన్పిస్తోంది.

    ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే మల్టిస్టారర్ మూవీగా రాబోతుంది. ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మాణం అవుతున్న ఈ మూవీలో టాలీవుడ్.. బాలీవుడ్.. హలీవుడ్ కు చెందిన భారీతారాగణం నటించనుంది. దీనికితోడు ఆయా భాషల్లోని సూపర్ స్టార్లతో సినిమాకు వాయిస్ ఓవర్ ఇప్పించడం వల్ల ‘ఆర్ఆర్ఆర్’కు మరింత మైలేజ్ కానుంది. రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే ‘ఆర్ఆర్ఆర్’కు ఆయన అదనపు హంగులను హద్దుతున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్