
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా ఉన్న నోముల నర్సింహ్మయ్య మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసిన నోముల లేని బాధ తీర్చలేనిదన్నారు. 1956లో జన్మించిన నోముల ఎంపీపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మొదట సీపీఎం పార్టీలో చేరి రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత 2018లో టీఆర్ఎస్ లోచేరి నాగార్జున సాగర్ నుంచి బరిలో దిగారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై గెలుపొందారు.