https://oktelugu.com/

సంక్రాంతి రోజు ఏ పనిచేయాలి? ఏ పని చేయకూడదు?

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు భోగి, మకర సంక్రమణం, కనుమ ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు నాలుగోరోజు ముక్కనుమ జరుపతారు. సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2021 / 09:56 AM IST
    Follow us on

    ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు భోగి, మకర సంక్రమణం, కనుమ ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు నాలుగోరోజు ముక్కనుమ జరుపతారు. సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు.

    Also Read: కల్వకుంట్ల కవిత భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకు వెళ్లారు?

    ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. అంతటి విశిష్టతగల పండుగ నాడు ఈ పనులు చేస్తే అష్టదరిద్రం ఆవహిస్తుందట.. అంతేకాదు.. ఆయురారోగ్యాలపై కూడా ప్రభావం చూపుతుందట.. అందుకే సంక్రాంతి రోజు అందరూ ఈ ఈ పనులు చేయకండి..

    * సంక్రాంతి రోజున చేయకూడని పనులు ఇవే..
    *సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే భోగి, సంక్రాంతి రోజున మద్యం, మాంసం అస్సలు ముట్టకూడదు..ఒక వేళ ముడితే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం దెబ్బ తింటుందని పురాణాల్లో ఉంది.

    Also Read: జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్.. పోట్లగిత్తలా పరిగెత్తాడే?

    * ఇక మకర సంక్రాంతి రోజు ఎంతమంది భిక్షం వస్తే అంతమందికి వేయాలి. వేయకపోతే పాపం చుట్టుకుంటుందట..

    * అలాగే పాలను విరగ్గొట్టడం లాంటి చేయకూడదు. ఇలా చేస్తే సూర్యుడికి కోపం వచ్చి ఇంట్లోవారికి ఆరోగ్యం పాడవుతుంది.

    * ఇక సంక్రాంతిరోజు ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించాలట..

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్