హైదరాబాద్ వాసులకు బుక్ చేసుకున్న 2గంటల్లో సిలిండర్.. కానీ..?

సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ ను మాత్రమే కలిగి ఉంటారు. అయితే గ్యాస్ సిలిండర్ లో అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే ఇబ్బందులు పడక తప్పదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అడుగులు వేస్తోంది. తత్కాల్ సేవలను మొదట ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని అనుకున్న ఐవోసీ ఈ నెల 16వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి […]

Written By: Navya, Updated On : January 14, 2021 10:47 am
Follow us on


సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ ను మాత్రమే కలిగి ఉంటారు. అయితే గ్యాస్ సిలిండర్ లో అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే ఇబ్బందులు పడక తప్పదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అడుగులు వేస్తోంది. తత్కాల్ సేవలను మొదట ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలని అనుకున్న ఐవోసీ ఈ నెల 16వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది.

ఈ నెల 16వ తేదీ నుంచి హైదరాబాద్ వాసులకు గ్యాస్ సిలిండర్ తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పండగ సందర్భంగా తత్కాల్ సేవలను ఐవోసీ అందుబాటులోకి తెచ్చింది. అయితే తత్కాల్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసేవాళ్లు సాధారణ మొత్తంతో పోలిస్తే అదనంగా 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 25 రూపాయలు ఎక్కువ మొత్తమే అయినా తక్కువ సమయంలో గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి రానున్న ఈ సర్వీసుల ద్వారా గ్యాస్ సిలిండర్ యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. తొలుత హైదరాబాద్ లో అమలు చేసిన తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ సర్వీసులను ఐవోసీ విస్తరించనుందని తెలుస్తోంది. బుకింగ్ చేసుకున్న తరువాత అరగంట నుంచి రెండు గంటల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ కానుంది. అయితే ఇండేన్ గ్యాస్ సిలిండర్లు వాడే వాళ్లకు మాత్రమే తత్కాల్ గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఉంటుంది.

తత్కాల్ గ్యాస్ సిలిండర్లకు రశీదులు పొందే అవకాశం ఉండదు. ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ కు ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం తెలుస్తుంది. ఈ సేవల కోసం ప్రత్యేక యాప్ ను కూడా సిద్ధం చేయనున్నారని సమాచారం.