తెలంగాణ ఉద్యమ సేనాని.. స్వరాష్ట్రాన్ని సాధించిన ధీశాలి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదేమో.. తెలంగాణ నూతన రాష్ట్రంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నాడు దేశవ్యాప్తంగా అందరి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఏకంగా కేసీఆర్ పథకమైన ‘రైతుబంధు’ను మోడీ సర్కార్ కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ అంటూ అమలు చేస్తోంది. అయితే అదంతా గతం..
Also Read: దేశ ప్రజలందరూ ఊపిరిపీల్చుకోండి..!
గతమెంతో ఘనం అన్నట్టుగా రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఏం పనిచేయడం లేదన్న భావన అటు ప్రజల్లో ఇటు దేశవ్యాప్తంగా నెలకొంది. కొత్త పథకాలు లేవు. కరోనాలో మొత్తం స్తంభించిపోయింది.ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అందుకే అటు దుబ్బాకలో ఓటమి.. ఇటు జీహెచ్ఎంసీలో షాక్ తో కోలుకోకుండా ఉన్నారు.
ప్రజల్లో కేసీఆర్ కు పరపతి తగ్గిందనే విషయం తాజాగా తేటతెల్లమైంది. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఏబీపీ ఛానెల్ దేశవ్యాప్తంగా ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరు అన్న దానిపై అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఈ క్రమంలోనే టాప్ త్రీలో ఏపీ సీఎం జగన్ నిలిచి సంచలనం సృష్టించారు. ఏపీలో ఆయన అమలు చేస్తున్న నవరత్నాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలే సీఎం జగన్ ను దేశంలోనే 3వ స్థానంలో నిలిపి ఉత్తమ ముఖ్యమంత్రిగా చేశాయి.
Also Read: జగన్, చంద్రబాబును సైతం మార్చేస్తున్న బీజేపీ
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి చూస్తే ఇంతకంటే అవమానం ఉండదు. చివరి నుంచి నాలుగో స్థానంలో కేసీఆర్ నిలిచారు. చిట్టచివర ఉత్తరఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నిలిచారు.
ఇక దేశంలోనే నంబర్ 1 ఉత్తమ సీఎంగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ నిలవడం విశేషం. ఏకంగా 91శాతం మంది నవీన్ పట్నాయక్ పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇక మోడీ పనితీరుకు సైతం అక్కడి జనాలు సంతృప్తిగానే ఉన్నారు. 66శాతం మంది ఆయన పాలనపై సంతోషంగా ఉన్నట్టు ఏబీపీ సంస్థ వెల్లడించింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్