ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన 4వ టెస్లు రసకందాయంలో పడింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శనివారం ఉదయం 274/5 స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆ జట్టు మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లను కోల్పోయింది.
Also Read: 4వ టెస్ట్: ఆస్ట్రేలియాకు షాకిచ్చిన భారత బౌలర్లు
కెప్టెన్ టిమ్ పైన్ 50, కామెరూన్ గ్రీన్ 47 రాణించారు. వీరిద్దరూ 111 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిని శార్దుల్ ఠాగూర్ విడదీశాడు. చివర్లో నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్ ధాటిగా ఆడి జట్టు స్కోరును 350 పరుగులు దాటించారు. హేజల్ వుడ్ ను చివరి వికెట్ గా నటరాజన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 115.2 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇక ఆస్ట్రేలియా తరుఫున లబుషేన్ 108 పరుగులతో శతకం సాధించి జట్టు భారీ స్కోరు బాటలు వేశాడు. భారత బౌలర్లలో శార్దుల్ , వాషింగ్టన్, నటరాజన్ మూడేసి వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: 4వ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ
ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే తడబడింది. ఈసారి భారత్ కు శుభారంగం దక్కలేదు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 7 పరుగులకే కమిన్స్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల వరకు భారత్ తో 21-1 తో పోరాడుతోంది. ఈరోజు భారత్ పూర్తిగా నిలిచి భారీ స్కోరు సాధిస్తేనే మ్యాచ్ పై పట్టు చిక్కుతుంది. మరి రోజంతా భారత్ పోరాడుతుందా? లేదా అన్నది వేచిచూడాలి.