https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో చూపించింది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు పూనకం, అందుకే ఆయన హిట్ ప్లాప్ లకు అతీతమైన హీరో. ఇక తాజాగా ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయి ఫ్యాన్స్ కు మంచి కిక్ ను ఇచ్చింది. టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ షాట్స్ తో పాటు కోర్టు సీన్స్ షాట్స్ అలాగే యాక్షన్ సీన్స్ షాట్స్.. మొత్తానికి టీజర్ ఆకట్టుకుని రికార్డ్స్ సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ టీజర్ కి […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 09:53 AM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానులకు పూనకం, అందుకే ఆయన హిట్ ప్లాప్ లకు అతీతమైన హీరో. ఇక తాజాగా ‘వకీల్ సాబ్’ టీజర్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయి ఫ్యాన్స్ కు మంచి కిక్ ను ఇచ్చింది. టీజర్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ షాట్స్ తో పాటు కోర్టు సీన్స్ షాట్స్ అలాగే యాక్షన్ సీన్స్ షాట్స్.. మొత్తానికి టీజర్ ఆకట్టుకుని రికార్డ్స్ సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ టీజర్ కి రికార్డు స్థాయిలో అభిమానుల నుంచి స్పందన లభించడం, గంటల వ్యవధిలోనే అత్యధిక వ్యూస్ తో మోతెక్కించడంతో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో ఈ టీజర్ ప్రూఫ్ చేసింది.

    Also Read: ‘మాళవిక’ను కష్టాల్లో పడేసిన మాస్టర్ !

    ఇక రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. అయితే ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్ ఇది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో రాబోతుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో వేసవి వినోదంగా వకీల్ సాబ్ రాబోతుంది. ఓ వైపు థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా.. ఇటీవలే శాటిలైట్ రైట్స్ కూడా క్లోజ్ అయ్యాయని అంటున్నారు.

    Also Read: పవన్ కళ్యాణ్-రానా.. పవన్ ఫ్యాన్స్ కు గొప్ప గుడ్ న్యూస్

    కాగా ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. రూ. 15 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయట, థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మగువ సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్