Homeఅంతర్జాతీయంట్రంప్‌పై ఎందుకీ వ్యతిరేకత..? ఆయన ఓటమికి కారణాలేంటి?

ట్రంప్‌పై ఎందుకీ వ్యతిరేకత..? ఆయన ఓటమికి కారణాలేంటి?

Donald Trump Defeat

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయి. 2016 ఎన్నికల్లోనే ఆయన ఓడిపోతారంటూ సర్వే సంస్థలు తెలిపాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన యూఎస్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. అయితే గెలిచినప్పటి నుంచి ట్రంప్‌ ఒక ప్రత్యేక వ్యక్తిగా పేరుతెచ్చుకునా వివాదాస్పదుడనే ముద్ర పడింది. ఆయన చేసే ప్రసంగాలే పెద్దపెద్ద వివాదాలకు దారి తీశాయి. ఇక ప్రతీ విషయాన్ని సామరస్యంగా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించడంతో ఇతరులకు ఇబ్బందిగా మారేది. దేశ ప్రజల బాగోగుల కంటే కార్పొరేట్‌ వ్యవస్థపైనే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. దీంతో సగటు అమెరికన్‌కు ట్రంప్‌ వ్యవహార శైలి నచ్చలేదు. అందుకే ఆయనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫలితమే ఆయనను అధ్యక్ష గద్దె నుంచి దింపేలా చేసింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే ఈ వైరస్‌ పుట్టిన కొన్ని నెలల తరువాత అమెరికాలో ప్రవేశించింది. అంతకుముందే చైనాపై వైరస్‌ను కట్టడి చేయలేదని విమర్శలు చేసిన ట్రంప్‌ తన దేశం దగ్గరికి వచ్చే సరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. పైగా మాస్క్‌ కూడా పెట్టుకోనవసరం లేదనట్లుగా వ్యవహరించారు. కానీ చివరికి ట్రంప్‌నకే వైరస్‌ తాకింది. అయితే వైట్‌హౌజ్‌లో మహమ్మారి వ్యాధుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని 2018లో ట్రంప్ రద్దు చేయడం వివాదాస్పమైంది. ఇది కరోనా విషయంలో పెద్ద తప్పిదమైనట్లయింది. మరోవైపు అంటువ్యాధుల నిపుణుడైన అంతోనీ ఫౌచీని ట్రంప్‌ తరుచూ విమర్శించసాగారు. పార్టీలతో సంబంధం లేకుండా అమెరికాలో ఆరుగురు అధ్యక్షుల వద్ద పౌచీ పనిచేశారు. ఆయనకు అభిమాన సంఘాలున్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో ఇది కూడా వ్యతిరేకత వచ్చిందంటున్నారు.

Also Read: అమెరికాలో బైడెన్‌ విజయభేరి..! 284 ఓట్లతో అధ్యక్ష పదవికి ఎన్నిక

గత సంవత్సరంలో నల్లజాతీయుడు జార్జిప్లాయిడ్‌ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ట్రంప్‌ గెలిచినప్పటి నుంచి నల్లజాతీయులకు వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఈ సంఘటనను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి వివాదానికి ఆజ్యం పోశారు. ఆందోళనకారులను దేశీయ ఉగ్రవాదులంటూ కామెంట్‌ చేయడంతో నల్లజాతీయులు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఆందోళన వైట్‌హౌజ్‌ వరకు వెళ్లడంతో ఆయన బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ట్రంప్‌పై నల్లజాతీయులు వ్యతిరేకంగానే ఉన్నారు.

బిజినెస్‌ మ్యాన్‌గా ఎన్నో విజయాలు సాధించిన ట్రంప్‌ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్‌ వంటి దేశాలో అమెరికాతో కలిసి పనిచేసేవి. కానీ ట్రంప్‌ ఐరోపా దేశాలను దూరంగా పెట్టడంతో వ్యాపారాల్లో నష్టాలు సంభవించాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే స్టీల్‌, ఆటోమొబైల్‌ వంటి వాటిపై ఈ ప్రభావం భారీగా చూపాయి. ఇక నాటో వంటి కూటముల్లోని దేశాలను చిన్నచూపు చూడడం వంటి చర్యలు ట్రంప్‌ ఓటమికి కారణాలుగా చెప్పుకుంటున్నారు.

Also Read: ఎగ్జిట్ పోల్స్: బీహార్ లో అధికారం వీరిదే..

కరోనా కట్టడిలో వైఫల్యం.. దాన్నుంచి లాక్డౌన్.. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలుకావడానికి కారణమైంది. భారీగా ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు కోల్పోయి అమెరికన్లు ఆర్థిక ఇబ్బందులుపడ్డారు. ట్రంప్ వలసవాదులపై నిషేధం కూడా నిరుద్యోగిత మరింత పెరగడానికి కారణమైంది.వీటన్నింటిని అరికట్టడం.. మెరుగైన పాలన అందించడంలో క్లిష్ట సమయంలో ట్రంప్ పాలన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొత్తంగా అన్నింట్లోనూ ఉదాసీనత.. మొండితనం.. ముక్కుసూటితనమే ట్రంప్ ఓటమికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular