
భారత్‌లో కరోనా రికవరి శాతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. తాజాగా ఆదివారం బులిటెన్ ప్రకారం కరోనా రికవరీ రేటు 92.49 శాతం ఉండగా కేసుల నమోదు శాతం 6.03 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,673 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,07,754 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 559 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,26,121కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,12,665 యాక్టివ్ కేసులు ఉండగా.. 78,68,968మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. శీతాకాలం ప్రారంభమవుతుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రజలు తప్పనిసరిగా భైతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారరు.