
అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. సుప్రీంకోర్టుకు ఎక్కినా ఏపీ పంచాయితీ ఎన్నికలకు బ్రేక్ పడకపోవడంతో ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ సారథ్యంలో ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనేది ఏటూ తేల్చుకోని పరిస్థితి ఏర్పడింది.
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ సారథ్యంలో ఏపీ ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలు నిర్వహించే యోచనలో లేదు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ తాజాగా సమావేశమయ్యారు. ఎన్నికలకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపినందున ప్రభుత్వం తరుఫున అనుసరించాల్సిన వైఖరి, కోర్టు చెప్పిన అభిప్రాయాల తీరుపై చర్చించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా వెళుతున్న నేపథ్యంలో అతడికి సహకరించే విషయంపై ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ నిర్ణయంపైనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అనేది