https://oktelugu.com/

చైతన్య మెసేజ్ కు నిహారిక కన్నీళ్లు… !

మనిషి జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లి అనే బంధంలోకి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ వెంకట చైతన్యతో కలిసి ఇరు కుటుంబ సభ్యుల, బంధు,మిత్రుల సమక్షంలో గతేడాది డిసెంబర్ నెల 9వ తేదీన అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ప్రతి మూమెంట్ ని నాగబాబు, నిహారిక అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2021 / 04:33 PM IST
    Follow us on


    మనిషి జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లి అనే బంధంలోకి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ వెంకట చైతన్యతో కలిసి ఇరు కుటుంబ సభ్యుల, బంధు,మిత్రుల సమక్షంలో గతేడాది డిసెంబర్ నెల 9వ తేదీన అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ప్రతి మూమెంట్ ని నాగబాబు, నిహారిక అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉన్నారు. తాజాగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది .. ఆనందంలో ప్యాన్స్ !

    పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశాన్ని లాప్ టాప్ లో చూస్తూ నిహారిక భావోద్వేగానికి గురైంది. ”డియర్ నిహా…మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని, నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది” అని చైతన్య అంటున్న మాటలు వింటూ నిహారిక కన్నీరు పెట్టారు.

    Also Read: ఓకే రోజు పవన్, మహేష్ కొత్త చిత్రాలు !

    పెళ్లి వేడుకలో ఇరుకుటుంబాల సభ్యులు ఎంజాయ్‌ చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనువిందు చేశాయి. కల్యాణ తిలకం దిద్దిన సుష్మితని నిహారిక హత్తుకోవటం, పవన్ కళ్యాణ్ తో కలసి చిరంజీవి దంపతుల నవ్వులు, అల్లు అర్జున్ వరుణ్ తేజ్ ని ముద్దు పెట్టుకోవటం, తాళి కడుతున్న సమయంలో నిహారిక భావోద్వేగాలు, కూతురి సంతోషాన్ని చూస్తూ ఉబ్బితబ్బిబ్బయిపోతున్న నాగబాబు నవ్వులు ఇలా మరెన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్