https://oktelugu.com/

ఆ ఒక్క నిర్ణయం.. నిర్మాతలను గట్టెక్కించనుందా?

కరోనా ఎఫెక్ట్ తో సినిమారంగం పూర్తిగా కుదేలైపోయింది. గడిచిన ఆరేడు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు.. సినిమా షూటింగులు మొదలవుతున్నప్పటికీ ఈ రంగంలో పురోగతి మాత్రం కన్పించడం లేదు. Also Read: ర‌వితేజ‌ ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్.. కరోనా నిబంధనలతో షూటింగులు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. దీంతో వీటి నిర్వహణ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 11:44 AM IST
    Follow us on

    కరోనా ఎఫెక్ట్ తో సినిమారంగం పూర్తిగా కుదేలైపోయింది. గడిచిన ఆరేడు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే థియేటర్లు.. సినిమా షూటింగులు మొదలవుతున్నప్పటికీ ఈ రంగంలో పురోగతి మాత్రం కన్పించడం లేదు.

    Also Read: ర‌వితేజ‌ ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్..

    కరోనా నిబంధనలతో షూటింగులు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. దీంతో వీటి నిర్వహణ భారం కూడా నిర్మాతలపై అధికంగా పడుతోన్నారు. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు నిర్వహించడమంటే కత్తిమీద సాములాంటిదే. ఎవరైనా కరోనా సోకిందా? ఇక ఈ షూటింగులో పాల్గొన్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లాల్సిందే.

    దీంతో షూటింగుకు పెట్టిన ఖర్చంతా వృథాగా మారనుంది. ఇంతకముందే కంటే ఈ ఖర్చు నిర్మాతలకు మరింత భారంగా మారనుంది. దీంతో నిర్మాతలు అవస్థలు పడుతోన్నారు. ఇప్పటికే గత ఐదారు నెలలుగా షూటింగులు నిలిచిపోవడంతో అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కడం లేదు. దీంతో నటీనటులకు ఇచ్చిన అడ్వాన్సులు.. పెట్టుబడి మొత్తం ఎక్కడికక్కడి నిలిచిపోయింది. దీంతో నిర్మాతలకు వడ్డీల భారం తడిచిమోపడవుతోంది.

    కొందరు నిర్మాతలు ఇప్పటికే పూర్తి చేసిన సినిమాలను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓటీటీలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను నిర్మాతలు గట్టాక్కాలంటే హీరోహీరోయిన్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. ఈమేరకు నటీనటుల పారితోషికాల్లో 20శాతం కోతలు విధిస్తున్నట్లు గిల్డ్ ప్రకటించింది. అయితే దీనివల్ల నిర్మాతలు పూర్తిగా బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్-4: కుమార్ సాయి ఎలిమినేటెడ్?

    స్టార్ హీరోలు.. డైరెక్టర్లు సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటే నిర్మాతలు నష్టాలబారి నుంచి బయటపడే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి. దీనివల్ల నిర్మాతలు కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చే బాధ తప్పుతోంది. సినిమా లాభాల్లో మాత్రమే దర్శకులు, హీరోలు వాటా తీసుకోవడం వల్ల నిర్మాతలపై భారం తగ్గనుంది.ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు లాభాల్లో భాగస్వామ్యం తీసుకుంటున్నారు.

    వీరిబాటలోనే ప్రతీఒక్కరు భాగస్వామ్యం తీసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు ఈజీగా గట్టెక్కుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాభాలను.. నష్టాలను అందరూ సరిసమానంగా పంచుకోవడం ద్వారా ఎవరూ పెద్దగా నష్టపోకుండా ఉంటారని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.