https://oktelugu.com/

బిగ్ బాస్-4: కుమార్ సాయి ఎలిమినేటెడ్?

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. షో ప్రారంభంలో మిక్స్ డ్ టాక్ తో మొదలైన బిగ్ బాస్-4 క్రమంగా ప్రేక్షకులను ఎంటటైన్మెంట్ చేస్తూ అలరిస్తోంది. దీంతో బిగ్ బాస్-4కు మంచి టీఆర్పీ వస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 ఆరువారాలను పూర్తి చేసుకుంది. Also Read: ఆ నిర్మాతల వల్ల హీరో నాని హర్ట్ అయ్యారా..? ఆరో ఎలిమినేటర్ పై అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసినట్లు కన్పిస్తోంది. ఆరోవారంలో తొమ్మిదిమంది కంటెస్టెంట్లు నామినేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 11:40 AM IST
    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. షో ప్రారంభంలో మిక్స్ డ్ టాక్ తో మొదలైన బిగ్ బాస్-4 క్రమంగా ప్రేక్షకులను ఎంటటైన్మెంట్ చేస్తూ అలరిస్తోంది. దీంతో బిగ్ బాస్-4కు మంచి టీఆర్పీ వస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 ఆరువారాలను పూర్తి చేసుకుంది.

    Also Read: ఆ నిర్మాతల వల్ల హీరో నాని హర్ట్ అయ్యారా..?

    ఆరో ఎలిమినేటర్ పై అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసినట్లు కన్పిస్తోంది. ఆరోవారంలో తొమ్మిదిమంది కంటెస్టెంట్లు నామినేషన్ కు ఎంపికయ్యారు. వీరిలో నోయల్, దెత్తడి హరిక, అభిజిత్, లాస్య, దివీ, అరియానా, మోహబూబ్, కుమార్ సాయి ఉన్నారు. వీరిలో మోహబూబ్ ను కెప్టెన్ సొహెల్ తన ప్రత్యేక పవర్ తో ఎలిమినేషన్ నుంచి తప్పించాడు.

    వీరందరిలో అతితక్కువ ఓట్లు కుమార్ సాయికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆరో ఎలిమినేటర్ గా కుమార్ సాయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి కుమార్ సాయి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. కామెడీయన్ గా వెండితెరపై కుమార్ సాయి అలరించాడు. అయితే బిగ్ బాస్ లో మాత్రం కుమార్ సాయి అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

    నిత్యం ఎవరితో ఒకరు గొడవలు పడుతూ కన్పిస్తున్నాడు. ఎవరితోనూ పెద్దగా కనెక్ట్ కావడంలేదు. ఫిజికల్ టాస్కుల్లోనూ కుమార్ సాయి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇక మిగతా వాళ్లలా కుమార్ సాయి పెద్దగా ఫోకస్ కావడంలేదు. అంతేకాకుండా ప్రతీవారం అతడు నామినేషన్లలో నిలుస్తూ వస్తోంది. ఇక ఈ వారం అతడికి అందరి కంటే తక్కువగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది.

    దీంతో ఈ వారం కుమార్ సాయి ఎలిమినేట్ అవడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతిదీక్షిత్ అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వారిలో అనినాష్ మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టుగా మారాడు. తన కామెడీతో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీంతో ఇప్పట్లో అతడు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేలా కన్పించడం లేదు.

    Also Read: ర‌వితేజ‌ ‘ఖిలాడి’ ఫ‌స్ట్ లుక్..

    ఇప్పటికే బిగ్ బాస్ ఈవారం మగ కంటెస్టును బయటికి పంపించనున్నట్లు క్లూ ఇచ్చాడు. ఈనేపథ్యంలో కుమార్ సాయి ఎలిమినేటర్ గా బయటికి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ నామినేషన్లలో ఊహించని పరిణామాలు జరిగితే తప్ప కుమార్ సాయి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేడనే టాక్ విన్పిస్తోంది.