https://oktelugu.com/

వైఎస్సార్ సీపీకి టీడీపీ బంపరాఫర్.. ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేయండి.. పోటీపెట్టం

ఏపీలో రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. స్వ ప్రయోజనాల కోసం అక్కడి నేతలు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. హక్కుల కోసం పోరాడాల్సింది పోయి.. ఎవరికివారు ఆఫర్లు ఇచ్చేసుకుంటున్నారు. ఉద్యమం అంటూ ప్రజలను రెచ్చగొట్టి… రాజకీయ పావులను చేస్తున్నారు. అమయాక ప్రజల హక్కులతో ఏపీ నాయకులు చదరంగం ఆడుతున్నారు. విషయానికొస్తే… విశాఖఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పోరాడాల్సిన ఏపీ రాజకీయ పెద్దలు స్వప్రయోజనాలను వెతుక్కుంటున్నారు. కలిసి కట్టుగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2021 / 03:19 PM IST
    Follow us on


    ఏపీలో రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయి. స్వ ప్రయోజనాల కోసం అక్కడి నేతలు ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. హక్కుల కోసం పోరాడాల్సింది పోయి.. ఎవరికివారు ఆఫర్లు ఇచ్చేసుకుంటున్నారు. ఉద్యమం అంటూ ప్రజలను రెచ్చగొట్టి… రాజకీయ పావులను చేస్తున్నారు. అమయాక ప్రజల హక్కులతో ఏపీ నాయకులు చదరంగం ఆడుతున్నారు. విషయానికొస్తే… విశాఖఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పోరాడాల్సిన ఏపీ రాజకీయ పెద్దలు స్వప్రయోజనాలను వెతుక్కుంటున్నారు. కలిసి కట్టుగా ఉద్యమించాల్సింది పోయి.. చాలెంజ్ లకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీకి బంపరాఫర్ ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం మీరంతా రాజీనామా చేయండి.. ఫ్యాక్టరీ సాధించుకున్న తరువాత పోటీ పెట్టకుండానే అందరిని ఎన్నుకుంటామని గట్టి సవాల్ విసిరారు.. టీడీపీ సీనియర్ నేత గంట శ్రీనివాసరావు.

    Also Read: విశాఖ ఉక్కు పాపం.. బీజేపీ వైపు నెట్టిన జగన్

    విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు నిర్మణాత్మక కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణ వ్యవహారంపై రాష్ర్ట ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వైఖరిని ప్రధాన మంత్రి మోదీ స్వయంగా చెప్పినా.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు.. పెద్దలు ఏం జరగట్లేదంటూ.. పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తే.. దానికి టీడీపీ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందని తెలిపారు.

    స్టీల్ ప్లాంటును కాపాడుకోలేకపోతే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతామని.. ప్రజలు సాధించుకున్న ఈ ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రితో మాట్లాడే అవకాశం వచ్చినా.. స్టీల్ ప్లాంటు అంశంపై కనీసం ప్రస్తావించలేదని విమర్శలు గుప్పించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో పాదయాత్ర చేపట్టి.. ప్రధానిని కలిసి ప్రయివేటీకరణను అడ్డుకోవాలని గంటా డిమాండ్ చేశారు. ఢిల్లీలో పాదయాత్రకు తాము సిద్ధమని అందరూ కలిసి రావాలని కోరారు.

    Also Read: ప్రత్యేక హోదా నుంచి విశాఖస్టీల్ వరకు.. ఏపీపై బీజేపీ శీతకన్ను..

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా గతంలో ఢిల్లీ పెద్దలను కలిశారని గుర్తు చేశారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా.. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ శిబిరంలో కూర్చుంటే.. ఆ ప్రభావం వేరేగా ఉంటుందని తెలిపారు. ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ… రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు.. 25 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామాలు చేయాలని సూచించారు. అప్పుడు దేశమంతా ఏపీవైపు చూస్తుందని.. తెలిపారు. అందరూ రాజీనామా చేస్తేనే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పారు. వైకాపా రాజీనామా చేసిన చోట టీడీపీ పోటీ చేయదని స్పష్టం చేశారు. ఇందుకోసం నిర్ణయాత్మక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంకు కోరారు. అందరూ ముందుకొచ్చి.. ప్రయివేటీకరణను అడ్డుకోవాలని గంటా శ్రీనివాస్ రావు ఈ సందర్భంగా కోరారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్