https://oktelugu.com/

భారత బ్యాట్ మెన్స్ ను ఒక్క ట్వీట్ తో క్లిన్ బోల్డ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్..!

ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న పింక్ టెస్టులో టీం ఇండియా చెత్తరికార్డును క్రియేట్ చేసింది. రెండో ఇన్నింగ్ లో టీం ఇండియా బ్యాట్స్ మెన్ స్కోర్లు  4..9..2..0..4..0..8..4..0గా నమోదయ్యాయి. ఇక చివరి వికెట్ గా మహ్మద్ షమీ(1) చేతికి బాల్ బలంగా తగలడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిగారిగాడు. Also Read: అసీస్ దెబ్బ: కుప్పకూలిన టీమిండియా.. ఓటమి ముంగిట.. కేవలం 36పరుగులకే భారత్ చేతులేత్తడంతో టెస్టు చరిత్రలో 4వ అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా టీంఇండియా నిలిచింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 19, 2020 5:37 pm
    Follow us on

    India Team

    ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న పింక్ టెస్టులో టీం ఇండియా చెత్తరికార్డును క్రియేట్ చేసింది. రెండో ఇన్నింగ్ లో టీం ఇండియా బ్యాట్స్ మెన్ స్కోర్లు  4..9..2..0..4..0..8..4..0గా నమోదయ్యాయి. ఇక చివరి వికెట్ గా మహ్మద్ షమీ(1) చేతికి బాల్ బలంగా తగలడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిగారిగాడు.

    Also Read: అసీస్ దెబ్బ: కుప్పకూలిన టీమిండియా.. ఓటమి ముంగిట..

    కేవలం 36పరుగులకే భారత్ చేతులేత్తడంతో టెస్టు చరిత్రలో 4వ అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా టీంఇండియా నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ లో 53 పరుగుల అధిక్యం సాధించిన భారత్ ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి కేవలం 36 పరుగులకే పేకమేడలా కూలింది. హాజిల్ వుడ్ ఐదు వికెట్లు.. కమిన్స్  నాలుగు వికెట్లు తీశాడు.

    భారత బ్యాట్స్ మెన్లో ఒక్కరు కూడా రెండెకల స్కోర్ చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్ లో 53పరుగులు కలుపుకుంటే ఆస్ట్రేలియా టార్గెట్ 90పరుగులే. బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతూ విజయానికి చేరువలో ఉంది.

    Also Read: ‘కంగారు’ పెట్టించారు..

    అయితే చెత్త రికార్డు క్రియేట్ చేసిన బ్యాట్సెమెన్స్ పై నెటిజన్లు ట్రోల్స్ మీమ్స్ చేస్తూ వారి కసి తీర్చుకునే పనిలో పడ్డారు. టీంఇండియా మాజీ క్రికెటర్లు సైతం బ్యాట్స్ మెన్ల స్కోర్లపై పెదవి విరుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

    తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన దైన స్టయిల్లో భారత్ క్రికెటర్ల స్కోర్ పై వ్యంగ్యస్త్రంతో ట్వీట్ చేశారు. మరిచిపోయే OTP 49204084041 టీం ఇండియా స్కోర్లను వీరేంద్ర సెహ్వాగ్ పోల్చాడు. దీనిని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.