వలస విధానాలపై అమెరికా తాజా ఉత్తర్వులు : ట్రంప్‌ విధానాలకు బైబై

వలసల విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశపెట్టిన కఠిన విధానాలకు చరమగీతం పాడేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయ వృత్తి నిపుణులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ శుభవార్త చెప్పారు. భారతీయ ఐటీ నిపుణులకు మేలు చేకూర్చే కొత్త వలస విధానానికి ఆమోదముద్ర వేశారు. Also Read: ఆ పార్టీల మధ్య అండర్‌‌ స్టాండింగ్‌ లోపిస్తోందా..? […]

Written By: Srinivas, Updated On : February 4, 2021 4:49 pm
Follow us on


వలసల విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశపెట్టిన కఠిన విధానాలకు చరమగీతం పాడేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. అమెరికాలో పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయ వృత్తి నిపుణులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ శుభవార్త చెప్పారు. భారతీయ ఐటీ నిపుణులకు మేలు చేకూర్చే కొత్త వలస విధానానికి ఆమోదముద్ర వేశారు.

Also Read: ఆ పార్టీల మధ్య అండర్‌‌ స్టాండింగ్‌ లోపిస్తోందా..?

ట్రంప్‌ హయాంలో అమలులో ఉన్న కఠినతర వలస విధానాలను రద్దు చేస్తూ మూడు కీలకమైన ఉత్తర్వులపై సంతకం చేశారు. మొదటి ఉత్తర్వు.. దేశ సరిహద్దుల వద్ద సొంత కుటుంబాలకు దూరమైన చిన్నారులను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ఉద్దేశించింది. ట్రంప్‌ హయాంలో అమెరికా- మెక్సికో సరిహద్దులో సుమారు 5,500 కుటుంబాలు తమ పిల్లలకు దూరమయ్యాయి. పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేయనున్నారు.

మెక్సికో సరిహద్దుల ద్వారా అమెరికాలోకి వలస వచ్చే వారికి ఆశ్రయం కల్పించేందుకు ఉద్దేశించి రెండో ఉత్తర్వును జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వలస విధానాలను సమీక్షించి సురక్షితమైన పారదర్శక వలస విధానాన్ని రూపొందించడానికిగాను మూడో ఉత్తర్వును జారీచేశారు. భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తిని కీలకమైన కాంగ్రెషనల్‌ ఆసియన్‌ పసిఫిక్‌ అమెరికన్‌ కాక్‌స(సీఏపీఏసీ)కు చెందిన ఇమిగ్రేషన్‌ టాస్క్‌ఫోర్స్‌ కో-చైర్మన్‌గా నియమించారు. వలసదారులు, తాత్కాలికంగా నివసిస్తున్న వారికి చట్టపరంగా రక్షణ, వలసదారుల పౌరసత్వం వంటి విషయాలలో సహాయపడటం ఈ టాస్క్‌ఫోర్స్‌ లక్ష్యం.

Also Read: రైతుల ఆందోళనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

మరోవైపు చైనాతో తమకు తీవ్ర పోటీ ఉందని అమెరికా అంగీకరించింది. ఆ దేశ దూకుడుకు కళ్లెం వేస్తామని పునరుద్ఘాటించింది. ఇటీవల కాలంలో డ్రాగన్‌ చర్యలు తమ పౌరుల ప్రయోజనాలకు విఘాతం కలిగించాయని.. అమెరికా కూటములకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ప్రముఖ భారతీయ అమెరికన్‌ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి కీలక పదవిని దక్కించుకున్నారు. కాంగ్రెషనల్‌ ఆసియన్‌ పసిఫిక్‌ అమెరికన్‌ కాకస్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్‌ కార్యదళానికి ఉమ్మడి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. డ్రీమర్లు, తాత్కాలిక రక్షణ హోదా ఉన్నవారికి రక్షణ కల్పించడం.. ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో సంస్కరణలకు సహకరించడం వంటి ఈ కార్యదళం లక్ష్యాలు. మరో భారతీయ అమెరికన్‌ చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్‌ ఈ కార్యదళానికి అధ్యక్షురాలు కావడం విశేషం. మరోవైపు అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రధాన వైద్యాధికారిగా భారతీయ అమెరికన్‌ డాక్టర్‌‌ ప్రితేష్‌ గాంధీని బైడెన్‌ నియమించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్