బలమైన ఆస్ట్రేలియా టీంను అదే ఆస్ట్రేలియాలో మట్టికరిపించిన యువ భారత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఓటమి నుంచి గెలుపు దిశగా పయనించేలా చేసిన కుర్రాళ్లు అద్భుతమే చేశారు. 32 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను ఓడించి వారికి గర్వభంగం చేశారు.
Also Read: అసీస్ కు గర్వభంగం.. భారత్ చేసిన అద్భుతం
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించడంతో భారత డ్రెస్సింగ్ రూంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. విజయానంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూంలో జట్టును ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు. ఎన్నో ప్రతికూలతల నడుమ అద్భుత పోరాటం చేశారని కొనియాడారు. ఆ మాటల వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. రవిశాస్త్రి ప్రసంగిస్తున్న సమయంలో ఆటగాళ్లు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘మీరు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, స్ఫూర్తి అసాధారణం.. గాయాలు, 36 పరుగులకే ఆల్ ఔట్ కావడం.. ఇలా ఎన్నో ప్రతికూలతలు అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదు.. గొప్ప పోరాట పటిమ చూపించి జట్టుగా విజయం సాధించారు. భారత్ మాత్రమే కాదు.. మీ గెలుపుకు ప్రపంచమంతా నిలుచొని మీకు సెల్యూట్ చేస్తోంది.. మీరు సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తుంచుకోండి.. ఈ క్షణాలను ఆస్వాదించండి.. ఆనందంగా ఉండండి’ అని రవిశాస్త్రి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.
Also Read: వాహ్.. టీమిండియా.. అద్భుతం.. అనూహ్యం..
ఈ సందర్భంగా ఒక్కో ఆటగాడిని పేర్కొంటూ రవిశాస్త్రి పొగడ్తలు కురిపించారు. శుభ్ మన్ గిల్ గ్రేట్ అంటూ ప్రశంసించాడు. ఇక పూజారాను పోరాట యోధుడు అంటూ కొనియాడారు. రిషబ్ పంత్ ప్రదర్శన అత్యద్భుతం అని.. పంత్ బ్యాటింగ్ చేస్తుంటే హార్ట్ ఎటాక్ వస్తుందని అనిపించిందని.. గొప్పగా పంత్ జట్టును గెలిపించాడని రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్ రహానే జట్టును పుంజుకునేలా చేశాడని.. జట్టును ఘనంగా నడిపించాడని కొనియాడారు.
తొలి ఇన్నింగ్స్ లో 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోతే సుందర్, శార్ధూల్ లు పట్టుదలతో ఆడి 336 పరుగులు చేశారని.. ఆస్ట్రేలియాపై గెలవడానికి ఆ ఇన్నింగ్స్ కారణమని రవిశాస్త్రి ప్రతి ఒక్క ఆటగాడి కృషిని గుర్తుచేశాడు.
https://twitter.com/BCCI/status/1351552015562805249?s=20