https://oktelugu.com/

వైరల్: ప్రపంచాన్ని కదిలిస్తున్న ఫొటో

ప్రపంచాన్ని ఈ ఫొటో కదిలిస్తోంది. మానవ హక్కులను చిదిమేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి.. ప్రజలను బంధీలుగా చేసి తుపాకులతో పాలిస్తున్న మయన్మార్ పాలకుల దారుణాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అప్పట్లో సిరియా మారణహోమంలో సముద్రాలు దాటుతుండగా ఓ బాలుడు చనిపోయి గ్రీస్ తీరానికి కొట్టుకొచ్చిన ఫొటో అందరినీ కదిలించింది. తాజాగా మయన్మార్ లో సైనిక పాలనలో ప్రజల ప్రాణాలు తీస్తున్న పోలీసులకు ఎదురెళ్లిన ఓ క్రైస్తవ సన్యాసి ఫొటో వైరల్ గా మారింది. మయన్మార్ లోని కచిన్ రాష్ట్రంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2021 / 09:50 PM IST
    Follow us on

    ప్రపంచాన్ని ఈ ఫొటో కదిలిస్తోంది. మానవ హక్కులను చిదిమేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి.. ప్రజలను బంధీలుగా చేసి తుపాకులతో పాలిస్తున్న మయన్మార్ పాలకుల దారుణాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

    అప్పట్లో సిరియా మారణహోమంలో సముద్రాలు దాటుతుండగా ఓ బాలుడు చనిపోయి గ్రీస్ తీరానికి కొట్టుకొచ్చిన ఫొటో అందరినీ కదిలించింది. తాజాగా మయన్మార్ లో సైనిక పాలనలో ప్రజల ప్రాణాలు తీస్తున్న పోలీసులకు ఎదురెళ్లిన ఓ క్రైస్తవ సన్యాసి ఫొటో వైరల్ గా మారింది.

    మయన్మార్ లోని కచిన్ రాష్ట్రంలో మైత్ క్వీనా నగరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే మయన్మార్ లో రోడ్లపైకి వచ్చిన 60 మంది ఆందోళనకారులు ఇప్పటికే సైన్యం తూటాలకు బలయ్యారు. తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగాయి. పోలీసులు కాల్పులు జరపగా ఒకరు చనిపోయారు.

    దీంతో అక్కడే ఉన్న సిస్టర్ అన్న్ రోజ్ పోలీసులను ఆపడానికి ప్రయత్నించారు. వారు ఆగకపోవడంతో మోకాళ్లపై నిలబడి నన్ను చంపడని.. ప్రజలపై కాల్పులు జరపవద్దంటూ వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఈ ఫొటో వైరల్ అయ్యింది. ఇద్దరు సైనికులు సైతం సిస్టర్ కు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది.

    ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోలీసులకు ఎదురెళ్లిన ఈ సిస్టర్ త్యాగనిరతికి ప్రపంచం సెల్యూట్ చేస్తోంది. చాలా మంది దీన్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.