https://oktelugu.com/

బ్రేకింగ్ : మెగా స్టార్ చిరంజీవికి అస్వస్థత.. సడెన్ గా..

ఎండలు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి భానుడి వేడికి మాడు పగులుతోంది. చురుక్కుమనేలా వేడి వస్తోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం పూట ఎండలో వెళితే కొంచెం పెద్దవారికి రిస్క్ నే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్ బారినపడ్డారు. దాంతో ఆ చార్య సినిమా షూటింగ్ ను అర్థాంతరంగా నిలిపివేశారు. మూడు రోజులుగా ఇల్లండు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆచార్య మూవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2021 / 10:02 PM IST
    Follow us on

    ఎండలు మొదలయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి భానుడి వేడికి మాడు పగులుతోంది. చురుక్కుమనేలా వేడి వస్తోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం పూట ఎండలో వెళితే కొంచెం పెద్దవారికి రిస్క్ నే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

    ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి అధిక వేడి కారణంగా డీహైడ్రేషన్ బారినపడ్డారు. దాంతో ఆ చార్య సినిమా షూటింగ్ ను అర్థాంతరంగా నిలిపివేశారు.

    మూడు రోజులుగా ఇల్లండు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆచార్య మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఓపెన్ కాస్ట్ లు అంటేనే బొగ్గుతో అధిక వేడి ఉంటుంది.. పైగా ఎండాకాలం కావడంతో మరింత హీట్ ఉంటుంది. అక్కడ సాధారణం కంటే మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

    ఏడురోజుల షెడ్యూల్ తో షూటింగ్ జరుపుతుండగా ఇల్లందు ఓపెన్ కాస్ట్ గనుల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధిక వేడి కారణంగా చిరంజీవి డీహైడ్రేషన్ కు గురయ్యారు.

    దాంతో మూడురోజుల్లోనే షూటింగ్ ను ముగించేసిన చిత్రం యూనిట్ హైదరాబాద్ రిటర్న్ అయ్యింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ షూటింగ్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.