
సినిమాల్లో ఆంటీ క్యారెక్టర్లు వేస్తూ.. పద్ధతి అయిన పాత్రల్లో కనిపించే నటి ప్రగతి.. తల్లిగా.. చెల్లిగా.. ఆంటీగా కనిపిస్తూ సినిమాల్లో అలరిస్తుంటుంది. ప్రతీసారి చీరలో ఒద్దికగా కనిపించే ప్రగతి తాజాగా జిమ్ చేస్తూ టైట్ షర్ట్, ప్యాంట్లు వేసుకొని కనిపిస్తోంది.
తాజాగా జిమ్ లో టైట్ షర్ట్ ప్యాంట్ వేసుకొని కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రగతి ఆంటీ ఏంటి ఇలా మోడ్రన్ లుక్ లో కనిపించడం ఏంటని సినీ ప్రముఖులు, అభిమానులు షాక్ అయ్యారు. ప్రగతిని ఈ లుక్ లో చూస్తామని అనుకోలేదని అంటున్నారు.
ఒద్దికగా కనిపించే ప్రగతి ఇలా ఆధునిక స్టైల్లో కనిపించేసరికి కుర్రకారు అంతా షేక్ అవుతున్నారు. ఇంకా అమ్మాయి అనుకుంటున్నావా? ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులోనూ ప్రగతి ఫిట్ నెస్ పై శ్రద్ధ చూశాక ఎవ్వరైనా ఆశ్చర్యపోక మానరు.
ప్రగతి వీడియో లింక్