spot_img
Homeఅత్యంత ప్రజాదరణచిత్రపురిలో మళ్లీ విక్టరీ కొట్టిన వినోద్ బాల ప్యానెల్..!

చిత్రపురిలో మళ్లీ విక్టరీ కొట్టిన వినోద్ బాల ప్యానెల్..!

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో గురువారం హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానల్స్ పోటీపడ్డాయి. వీటిలో ఇప్పటికే అధికారంలో ఉన్న వినోద్ బాల ప్యానెల్ తోపాటు సి.కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన ‘మన ప్యానెల్’.. ఓ.కళ్యాణ్ ప్యానెల్.. కొమర వెంకటేశ్ ప్యానెల్స్ బరిలో నిలిచాయి.

Also Read: పరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?

చిత్రపురి కాలనీలో మొత్తం 4,803 ఓట్లు ఉన్నాయి. వీరంతా కూడా నిన్న ఉదయం 7గంటల నుంచే పోలింగ్ లో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది. మధ్యాహ్నం సమయంలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి అరుణ తెలిపారు. ఎన్నికల ముగిశాక కౌంటింగ్ ఏర్పాట్లు చేసి ఫలితాలను వెల్లడించారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో వినోద్ బాల ప్యానెలే తిరిగి విజయం సాధించింది. ఈ ప్యానెల్ నుంచి 11 మంది అభ్యర్థులు పోటీచేయగా 10మంది గెలుపొందారు.

Also Read: పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..!

వీరిలో వల్లభనేని అనిల్ కుమార్.. అనుముల మహనంద రెడ్డి.. అళహరి.. కాదంబరి కిరణ్.. కొంగర రామకృష్ణ ప్రసాద్‌.. పీఎస్ఎన్. దొర.. ప్రవీణ్‌ కుమార్ యాదవ్.. నిమ్మగడ్డ అనిత.. దీప్తి వాజ్ పేయి.. టి.లలితలు గెలుపొందారు. ఈ ప్యానల్లో చిల్లర వేణు ఒక్కరే ఓడిపోయాడు. అదేవిధంగా కొమర వెంకటేశ్ ప్యానెల్ నుంచి పోటీచేసిన వారిలో రఘు బత్తుల విజయం సాధించారు

చిత్రపురిలో జరిగిన ఎన్నికల ప్రచారం భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వినోద్ బాల ప్యానెల్ పై ఇటీవల ఓ.కల్యాణ్ ప్యానెల్ అనేక అవినీతి.. అక్రమాలకు పాల్పడ్డారణ ఆరోపణలు గుప్పించింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తిరిగి అదే ప్యానల్ ఘనవిజయం పొందడం గమనార్హం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version