https://oktelugu.com/

రాములమ్మ బీజేపీ నుంచి వెళ్లిపోవడానికి చంద్రబాబే కారణమట..!

తెలంగాణ సినీ నటి, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి బీజేపీలోకి చేరారు.. ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తరుణంలో మొదట బీజేపీలోనే చేరారు.. ఆ తరువాత పలు పార్టీలు మారినా.. చివరికి మళ్లీ కమలం గూటికే చేరుకున్నారు.. ఈ సందర్భంగా హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రాములమ్మ.. అప్పుడు బీజేపీ నుంచి ఎందుకు బయటికొచ్చారని కొందరు ప్రశ్నించారు. దీనికి సమాధానం విజయశాంతి ఇలా సమాధానం ఇచ్చారు… Also Read: పరుష […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2020 5:29 pm
    Vijayashanti

    Vijayashanti

    Follow us on

    Vijayashanti

    తెలంగాణ సినీ నటి, ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి బీజేపీలోకి చేరారు.. ఆమె సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తరుణంలో మొదట బీజేపీలోనే చేరారు.. ఆ తరువాత పలు పార్టీలు మారినా.. చివరికి మళ్లీ కమలం గూటికే చేరుకున్నారు.. ఈ సందర్భంగా హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన రాములమ్మ.. అప్పుడు బీజేపీ నుంచి ఎందుకు బయటికొచ్చారని కొందరు ప్రశ్నించారు. దీనికి సమాధానం విజయశాంతి ఇలా సమాధానం ఇచ్చారు…

    Also Read: పరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం వార్తల్లో ఉంటారు. అధికారంలో ఉన్నప్పటి విషయం పక్కనబెడితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వార్తల్లోకెక్కుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి రాజకీయ జీవితం అదుపు తప్పడానికి చంద్రబాబే కారణమంటూ విమర్శిస్తారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడానికి చంద్రబాబే కారణమని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ రోజూ ఎవరో ఒక వైసీపీ నాయకుడు చంద్రబాబు పేరెత్తని వారుండరు..

    తాజాగా విజయశాంతి సైతం తాను మొదట్లో బీజేపీ నుంచి బయటికి రావడానికి చంద్రబాబే కారణమంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో బీజేపీ, టీడీపీ అలయన్స్ ఉండేది. ఈ కూటమి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేదని, ఆ విధానం నచ్చకే కమలం పార్టీని వీడానని చెబుతోంది. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బీజేపీపై తనకు ఎలాంటి అయిష్టం లేదని, చంద్రబాబు వల్లే నేను టీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. కాగా రాములమ్మ బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి.. ఆ తరువాత సొంతపార్టీ.. చివరకి కాంగ్రెస్ లోకి వెళ్లారు.. తాజాగా బీజేపీ కండువా కప్పుకున్నారు.

    Also Read: పెద్దాయన సీఎం ఆశలు మాత్రం చావడం లేదుగా..!

    ఇక బీజేపీలో నిర్వహించిన సమావేశంలో విజయశాంతి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కేసీఆర్ తనకంటే గొప్ప నటుడని అన్నారు. తనను రాజకీయాల నుంచి తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. ఎప్పటీకీ పార్టీలు మారితే మనుగడ ఉండదని కొందరు విమర్శిస్తున్నారని.. అయితే తెలంగాణ కోసమే పార్టీలు మారుతున్నానని విజయశాంతి చెప్పుకొచ్చారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్