https://oktelugu.com/

అల్లు అర్జున్ పాలిట విలన్ గా మారిన క్రేజీ హీరో?

మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టైలీష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్సులు.. ఫైట్లతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మామ మెగాస్టార్ బాటలో దూసుకెళుతున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘అలవైకుంఠపురములో’ మూవీ రిలీజైంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అటూ అల్లు అర్జున్ కెరీర్లోనూ.. ఇటూ త్రివిక్రమ్ కెరీర్లోనూ బిగ్గెస్టుగా హిట్టుగా నిలిచింది. Also Read: బిగ్ సిక్రెట్ రిలీవ్ చేసిన రాహుల్ సింప్లిగంజ్..! ‘అలవైకుంఠపురములో’ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 04:10 PM IST
    Follow us on

    మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టైలీష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డాన్సులు.. ఫైట్లతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మామ మెగాస్టార్ బాటలో దూసుకెళుతున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ‘అలవైకుంఠపురములో’ మూవీ రిలీజైంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అటూ అల్లు అర్జున్ కెరీర్లోనూ.. ఇటూ త్రివిక్రమ్ కెరీర్లోనూ బిగ్గెస్టుగా హిట్టుగా నిలిచింది.

    Also Read: బిగ్ సిక్రెట్ రిలీవ్ చేసిన రాహుల్ సింప్లిగంజ్..!

    ‘అలవైకుంఠపురములో’ మూవీ తర్వాత బన్నీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. రంగస్థలం దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో ‘పుష్ప’ హ్యట్రిక్ మూవీగా రాబోతోంది. వీరిద్దరి కాంబోలో గతంలో ‘ఆర్య’.. ‘ఆర్య-2’ సినిమాలు వచ్చి అభిమానులను అలరించాయి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.‘పుష్ప’ మూవీని ప్యాన్ ఇండియాల్లో మైత్రీ మూవీ మేకర్స్‌.. ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. స్టైలీష్ గా కన్పించే అల్లు అర్జున్ ఈ మూవీ కోసం తొలిసారి డీ గ్లామర్గా కన్పించబోతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ కన్పించనుండటం విశేషం. పాత్రకు తగ్గట్టుగా మసినగడ్డం.. రఫ్ లుక్కులో కన్పించనున్నారు. ఇప్పటికే బన్నీ లుక్ సంబంధించిన పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

    ‘పుష్ప’లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ కంటే కూడా విలన్ ఎవరా? అనే అనే ఆసక్తే ముందు నుంచి నడుస్తోంది. ‘పుష్ప’లో విలన్ గా విజయ్ సేతుపతి తొలుత ఖరారైంది. అయితే అనుకోని కారణాలతో ఆయన తప్పుకోవడంతో పలువురు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ‘పుష్ప’లో విలన్ గా తమిళ నటులు ఆది.. బాబీ సింహా.. ఆర్య. మాధవన్ పేర్లు విన్పించాయి. అయితే తాజాగా మరో క్రేజీ హీరో పేరు తెరపైకి రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

    Also Read: అయ్యా బాబోయ్.. వార్నర్ ఏంటీ.. బిగ్ బీ.. ఎన్టీఆర్.. రామ్ లా మారాడు..!

    తాజా సమాచారం మేరకు ‘పుష్ప’లో చియాన్ విక్రమ్ నటిస్తాడనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు విక్రమ్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు ‘పుష్ప’ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే ప్రచారం జరుగుతోంది. నిజంగానే ‘అపరిచితుడు’ పుష్పలో విలన్ గా నటిస్తే మాత్రం ఈ సినిమాకు మరింత హైప్ రావడం ఖాయంగా కన్పిస్తోంది.

    కరోనా ఎఫెక్ట్ తో ‘పుష్ప’ షూటింగ్ నిలిచిపోగా ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఏపీలోని రాజమండ్రిలో ‘పుష్ప’ షూటింగ్ తాజాగా జరుపుకుంటోంది. ఇక ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలు సమకూరుస్తుండగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఫ్యామిలీ స్టార్ జగతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ‘పుష్ప’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్