https://oktelugu.com/

బిగ్ సిక్రెట్ రిలీవ్ చేసిన రాహుల్ సింప్లిగంజ్..!

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ షో తనకుంటూ ఓ సపరేట్ క్రేజ్ ను ఏర్పరచుకుంది. బుల్లితెరపై బిగ్ బాస్ నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ ఇబ్బందులను వెరవకుండా బిగ్ బాస్ తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకునేందుకు నాలుగో సీజన్ ప్రారంభించింది. గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ కొనసాగుతూ అభిమానులను అలరిస్తుంది. Also Read: అయ్యా బాబోయ్.. వార్నర్ ఏంటీ.. బిగ్ బీ.. ఎన్టీఆర్.. రామ్ లా మారాడు..! ప్రస్తుతం బిగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 03:58 PM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ షో తనకుంటూ ఓ సపరేట్ క్రేజ్ ను ఏర్పరచుకుంది. బుల్లితెరపై బిగ్ బాస్ నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. కరోనా టైంలోనూ ఇబ్బందులను వెరవకుండా బిగ్ బాస్ తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకునేందుకు నాలుగో సీజన్ ప్రారంభించింది. గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ కొనసాగుతూ అభిమానులను అలరిస్తుంది.

    Also Read: అయ్యా బాబోయ్.. వార్నర్ ఏంటీ.. బిగ్ బీ.. ఎన్టీఆర్.. రామ్ లా మారాడు..!

    ప్రస్తుతం బిగ్ బాస్-4 ప్రస్తుతం 12వ వారంలో కొనసాగుతోంది. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4లో దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది.

    ఈ ఏడుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అనేది ఆసక్తి మొదలైంది. 12వ వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాకుల మీదు షాకులు ఇస్తున్నాడు. వచ్చేవారానికి ఇమ్యూనిటీని అవినాష్ గెలుచుకోవడంతో గేమ్ మరింత రసవత్తరంగా మారింది. ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి అవినాష్ ఎస్కేప్ అయితే అతడికి మరో మూడు వారాలదాకా ఢోకా ఉంది. దీంతో అతడు టాప్-5లో ఉండటం ఖాయంగా కన్పిస్తోంది.

    బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో సెలబ్రెటీలంతా ఒక్కొక్కరుగా ఈ షోపై స్పందిస్తున్నారు. దీనిలో భాగంగా గత సీజన్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్ ప్రస్తుత సీజన్లోని కంటెస్టెంట్స్.. బిగ్ బాస్ లోని సిక్రెట్స్ రిలీవ్ చేశాడు. బిగ్ బాస్-4లో నోయల్ ఉన్నప్పుడు తానే టైటిల్ విన్నర్ అవుతాడని ప్రకటించిన రాహుల్ తాజాగా మాత్రం మరొక కంటెస్టెంట్ పేరు చెప్పి అందరికీ షాకిచ్చాడు.

    రాహుల్ సింప్లిగంజ్ గత సీజన్లో హౌజ్ లో తన తోటి కంటెస్టెంట్ అయిన పునర్నవితో ప్రేమాయణం జరిపి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ తోనే అతడు చివరి వరకు నిలిచి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఏకంగా మెగాస్టార్ చేతుల మీదుగా టైటిల్ అందుకొని అతడి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు. ప్రస్తుత సీజన్లో ఎలిమినేషన్ అవుతున్న కంటెస్టెంట్స్ ను రాహుల్ సింప్లిగంజ్ ఇంటర్వ్యూ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

    Also Read: రాజకీయాల్లోకి రీఎంట్రీపై బండ్ల గణేష్ క్లారిటీ

    ఈక్రమంలోనే బిగ్ బాస్-4 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌పై షాకింగ్ కామెంట్స్ చేయడంతోపాటు ఓ బిగ్ సిక్రెట్ ను రిలీవ్ చేశాడు. నాలుగో సీజన్‌లో నోయల్‌కే విజయావకాశాలు ఉన్నాయని గతంలో రాహుల్ వెల్లడించాడు. అతడు అనారోగ్య కారణాలతో హౌస్ నుంచి వెళ్లడంతో ప్రస్తుతం అతడు అభిజిత్‌కు ఓటేశాడు.

    అఖిజిత్ కే టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అతడి తర్వాత సోహెల్.. అరియానాకు గెలిచే ఛాన్సెస్ ఉందని అంచనా వేశాడు. ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత ‘నేను మేకలా లోపలికి వెళ్లి.. వాళ్లు పెట్టిన ప్రొటీన్లతో పులిలా తిరిగొచ్చా..’నని కామెంట్ చేయడాన్ని రాహుల్ తప్పుబట్టాడు.

    నాటి నుంచి అతడి ఆట తీరు బాగోలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అఖిల్ వ్యాఖ్యలు నాగార్జునకు కూడా నచ్చలేదని ఓ బిగ్ సిక్రెట్ రిలీవ్ చేశాడు. సెలబ్రెటీలంతా అభిజిత్ కే మద్దతు ఇస్తుండటంతో అతడే టైటిల్ విన్నర్ అవుతాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. అది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్