
గ్రేటర్ కొత్త పాలక మండలి ఏర్పాటు చేయకుండా ఫిబ్రవరి వరకు గడువు ఉందని అంటున్నారు, ఫిబ్రవరి వరకు గడువు ఉన్నప్పుడు ముందస్తుగా ఎందుకు ఎన్నికలు నిర్వహించావు..? అంటూ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ అప్పుల మయం అయింది, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల సంఘం ప్రభుత్వం తొత్తుగా వ్యవహరించకుండా పాలక మండలి ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైయిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.