Vetrimaaran : రామ్ చరణ్, వెంకటేష్ లతో క్రేజీ డైరెక్టర్

Vetrimaaran: ఈ మధ్య కాలంలో సౌత్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుల లిస్ట్ లో ముందువరుసలో నిలిచే పేరు తమిళ దర్శకుడు ‘వెట్రిమారన్’ (Vetrimaaran). అదే.. నారప్ప సినిమా ఒరిజినల్ డైరెక్టర్. ‘వెట్రిమారన్’ తమిళంలో.. ‘పొల్లధవన్, ఆడుకులం మరియు అసురన్’ లాంటి సినిమాలను తీశారు. ఒకే జోనర్ సినిమాలకి పరిమితమైన ఈయన సినిమాలన్నీ.. ఒక్కొక్క సినిమా ఒక్కో ఆణిముత్యం అయింది. మనం రోజూ వార్తల్లో చూసి, చిన్న చిన్న విషయాలే అని పట్టించుకోకుండా వదిలేసే అంశాలనే […]

Written By: admin, Updated On : September 3, 2021 10:43 am
Follow us on

Vetrimaaran: ఈ మధ్య కాలంలో సౌత్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుల లిస్ట్ లో ముందువరుసలో నిలిచే పేరు తమిళ దర్శకుడు ‘వెట్రిమారన్’ (Vetrimaaran). అదే.. నారప్ప సినిమా ఒరిజినల్ డైరెక్టర్. ‘వెట్రిమారన్’ తమిళంలో.. ‘పొల్లధవన్, ఆడుకులం మరియు అసురన్’ లాంటి సినిమాలను తీశారు. ఒకే జోనర్ సినిమాలకి పరిమితమైన ఈయన సినిమాలన్నీ.. ఒక్కొక్క సినిమా ఒక్కో ఆణిముత్యం అయింది.

మనం రోజూ వార్తల్లో చూసి, చిన్న చిన్న విషయాలే అని పట్టించుకోకుండా వదిలేసే అంశాలనే ‘వెట్రిమారన్’ తన సినిమాల్లో ఎంతో లోతుగా చూపిస్తాడు. ఇప్పటివరకు ‘వెట్రిమారన్’ తీసినవి ఐదు సినిమాలే, అయినా మొత్తం 5 నేషనల్ అవార్డులు 2 ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి. పైగా ప్రతి సినిమా కమర్షియల్ గానూ ఘన విజయం సాధించింది.

దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ దర్శకుని సత్తా ఏమిటనేది. ‘వెట్రిమారన్’ సినిమాల్లో కథే హీరో. ఆయన కథనంలో నుంచే ఎలివేషన్స్ తీసుకొస్తారు. ఒక్క సీన్ కూడా ఏదో ఇరికించినట్టు ఉండదు. అనవసరంగా ఒక పాత్ర కానీ సన్నివేశం కానీ ఆయన సినిమాల్లో కనిపించదు. ఇక వెగటు పుట్టించే కామెడీ అయితే అసలే ఉండదు, అన్నిటికి మించి సమయం సందర్భం లేని పాటలు అంతకన్నా ఉండవు.

తమిళ సినిమాల్లో కె.బాలచందర్, బాలు మహేంద్ర గార్ల తర్వాత ఇటువంటి సినిమాలు తీయడంలో ‘వెట్రిమారన్’ దిట్ట. అందుకే ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల చూపు ‘వెట్రిమారన్’ మీద పడింది. రామ్ చరణ్ (Ram Charan), శంకర్ తో సినిమా తర్వాత, ‘వెట్రిమారన్’తో ఒక సినిమా చేయాడనికి కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయట.

అలాగే విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా ‘వెట్రిమారన్’తో డైరెక్ట్ గా ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత సురేష్ బాబు. ఇప్పటికే సురేష్ బాబు ‘వెట్రిమారన్’కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మొత్తానికి తన దర్శకత్వ శైలితో ‘వెట్రిమారన్’ తెలుగు హీరోలను బాగానే ఆకట్టుకున్నాడు.