https://oktelugu.com/

Revanth Reddy: వైఎస్ కుటుంబం, కేసీఆర్ పై రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇటు కేసీఆర్ తీరు.. అటు వైఎస్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కొట్లాట ‘కేఆర్ఎంబీ’ సమావేశం జరుగుతుంటే నీటి గురించి మాట్లాడకుండా నామా నాగేశ్వరరావు ఇంట్లో కేసీఆర్ వింధు భోజనం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో టి.ఆర్.ఎస్ భవన్ శంకుస్థాపన కు ఒక రోజు ముందే కేసీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కీలకమైన […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2021 3:12 pm
    Follow us on

    Revanth Reddy Comments On KCR and YS Family

    Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇటు కేసీఆర్ తీరు.. అటు వైఎస్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి కొట్లాట ‘కేఆర్ఎంబీ’ సమావేశం జరుగుతుంటే నీటి గురించి మాట్లాడకుండా నామా నాగేశ్వరరావు ఇంట్లో కేసీఆర్ వింధు భోజనం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో టి.ఆర్.ఎస్ భవన్ శంకుస్థాపన కు ఒక రోజు ముందే కేసీఆర్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కీలకమైన కేఆర్ఎంబీ మీటింగ్ ఉంటే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు.

    వ్యూహాత్మకంగా కేసీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నీటి కేటాయించమపులను పట్టించుకోకుండా.. సమస్యను విద్యుత్ ఉత్పత్తి వైపు మళ్లిస్తున్నారని.. పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాత ఇతర బేసిన్ లోకి నీటిని తీసుకెళ్లాలని సూచించారు. శ్రీశైలంలో జల విద్యుత్ చేయాలా అనేది సమస్య కాదని.. తెలంగాణ ప్రయోజనాలను.. జగన్ కం తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

    వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ తరపున ఘనంగా నివాళులర్పించామని రేవంత్ రెడ్డి తెలిపారు. వైఎస్ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. వైఎస్ కోరిక మేరకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రయత్నిస్తామన్నారు.

    తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీటి పంపకాలపైనే జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణ నదిలో 811 టీఎంసీలు కేటాయించారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సంధర్భంగా నీటి పంపకాల సందర్భంగా వివాదాలు వస్తే.. పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్, బోర్డు లను ఏర్పాటు చేసింది. నీటి పంపకాలు విభజన జరిగిన తర్వాత అమలు విధానం కోసం కేఆర్ఎంబీ , జీఆర్ఎంబీ‌ లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా.. సీఎం కేసీఆర్ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వేళ్లి పంపకాలు చేసుకున్నారు. ఒక్క సంవత్సరం కోసం తెలంగాణ కు 299 టీఎంసీ లు , ఏపీకి 512 టీఎంసీలు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రతీ ఏడాది ఇదే నీటీ వాటాను కొనసాగించారు’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.

    203జీవో ప్రగతి భవన్ లో తయారైంది.. ఈ జీవో ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ప్రతీ రోజు మూడు టీఎంసీల ను తరలించే అవకాశం కల్పించారు. ఏపీ అసెంబ్లీ లో జగన్ ప్రకటన తర్వాత .. కాంగ్రెస్ తరపున నాగం జనార్దన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. అసెంబ్లీలో జగన్ ప్రకటన తర్వాత .. ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తరపున దీక్షలు ధర్నాలు చేస్తే.. కేసీఆర్ పట్టించుకోలేదు. కేఆర్ఎంబీ మీటింగ్ లు పెడితే తెలంగాణ తరపున గైర్హాజరు అయ్యారు. తెలంగాణ రైతాంగ హక్కుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని రేవంత్ తీవ్రంగా మండిపడ్డారు.

    కేసీఆర్ ప్రాధాన్యతలో కృష్ణా జలాలు అంటే లెక్కలేదని.. నిన్న జరిగిన బోర్డు మీటింగ్ లో కూడా 299 టీఎంసీ లు చాలని ఒప్పుకొని సంతకాలు చేశారని రేవంత్ ఆరోపించారు.దక్షిణ తెలంగాణ కు చెందిన మంత్రులందరూ కృష్ణా లో 50 శాతం వాటా కావాలని మాట్లాడారు.. కానీ మీటింగ్ లో చేతలు వేరుగా ఉన్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ లో టీ.ఆర్.ఎస్ ఎంపీలు పల్లెత్తు మాట మాట్లాడలేదు.. మోడీ తెచ్చే బిల్లులకు మద్దతు తెలిపారని మండిపడ్డారు. మోడీకి అండగా నిలబడి.. తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా ముంచారన్నారు.

    హైదరాబాద్ తాగునీటికి ఆధారపడిన కృష్ణా జలాల వినియోగంలో సమర్థవంతంగా వాదనలు వినిపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ పరిధిలో లేని అధికారాలపై మీటింగ్ లో మాట్లాడుతున్నారు. నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్, ట్రిబ్యునల్ లేదా సుప్రీంకోర్టు చేయాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ పరిధి.. అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తుంది. కేఆర్ఎంబీ మీటింగ్ లో సంబంధం లేని ఇష్యూ మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం పై పాలమూరు కు చెందిన సామాన్య రైతు ఎన్జీటీలో కేసు వేశారు. తర్వాత ప్రభుత్వం ఇన్ క్లూడ్ అయ్యిందని రేవంత్ స్పష్టం చేశారు.

    ఎన్జీటీ ఇచ్చిన తీర్పు పై తెలంగాణ ఎందుకు ముందుకు పోవడం లేదు. బీజేపీ, టీ.ఆర్.ఎస్ గల్లీలో కుస్తీ .. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఏ ప్రాంతీయ పార్టీ కి ఢిల్లీలో భూమి కేటాయించలేదన్నారు. బండి సంజయ్ మోకాలి చిప్పలు అరిగినా.. మోడీ దర్శనం కలగదు. మోడీ , కేసీఆర్ ఇద్దరూ ఒక్కరే.. తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లు అని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయం లో బీజేపీ విధానం ఏంటనేది స్పష్టం చేయాలి.

    విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళం వాళ్ల ఫ్యామిలీ కి సంబందించినది .. రాజకీయ ప్రాధాన్యం లేదని రేవంత్ తెలిపారు. వైఎస్ కు ఆత్మీయ సమ్మేళనంకు జగన్ ఎందుకు రావడం లేదో వారే చెప్పాలని నిలదీశారు.