Homeఅత్యంత ప్రజాదరణన్యాయవ్యవస్థపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

న్యాయవ్యవస్థపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

కొద్దిరోజులుగా దేశంలో వస్తున్న తీర్పులు, కొన్ని హైకోర్టులు ఏకపక్షంగా ఇస్తున్న తీర్పులపై తీవ్రమైన చర్చ దేశంలో జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ అయితే ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులపై , కొందరు రాజకీయ నాయకుల లాబీయింగ్ పై తాజాగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం సంచలనమైంది. దీని దుమారం ఢిల్లీలో జరుగుతుండగానే తాజాగా దేశానికి ఉపరాష్ట్రపతి.. మన తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు ఇదే న్యాయవ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.

Also Read: బండి సంజయ్ మరో దుమారం

తాజాగా వెంకయ్య నాయుడు గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు. న్యాయవ్యవస్థ తన పరిధి దాటిందనే ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కోర్టు తీర్పులు కలిగిస్తున్నాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదని.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఏదీ ఒకదానిపై మరొకటి ఉన్నతమైనదిగా చెప్పుకోకూడదని తెలిపారు. రాజ్యాంగం పరిధిలోనే ఈ మూడు వ్యవస్థలు పనిచేయాలని సూచించారు.

కోర్టులు అప్పుడప్పుడు తమ పరిధి దాటి శాసన, కార్యనిర్వాహక విభాగాల పరిధిలో ప్రవేశిస్తున్నాయా? అనే ఆందోళనలు రేకెత్తుతున్నాయని వెంకయ్య అన్నారు. కొన్ని అంశాలను ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు వదిలిపెట్టి ఉండవలసిందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

Also Read: టీఆర్ఎస్ వ్యూహానికి బీజేపీ సెల్ఫ్ గోల్..!

ఈ క్రమంలోనే పలు ఉదాహరణలను వెంకయ్య చెప్పుకొచ్చారు. దీపావళి బాణసంచా కాల్చడంపై ఇచ్చిన తీర్పును, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక శాఖ పాత్రను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. వెంకయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రతి విభాగం ఇతర విభాగాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పని చేసుకోవడంలోనే సామరస్యం ఉంటుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.. దీనివల్ల పరస్పర గౌరవం, బాధ్యత, సంయమన భావం ఏర్పడుతుందన్నారు. దురదృష్టవశాత్తూ హద్దులు దాటిన సందర్భాలు కొన్ని కనిపిస్తున్నట్లు తెలిపారు. పరిధి దాటినట్లు స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించే కొన్ని తీర్పులు ఉన్నాయని వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ ఎగ్జిక్యూటివ్‌గా, సూపర్ లెజిస్లేచర్‌గా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోందనే భావన కలిగే విధంగా వ్యవహరించడం వాంఛనీయం కాదని వెంకయ్య అన్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version