https://oktelugu.com/

టీఆర్ఎస్, ఎంఐఎం నేతలకు ఎందుకీ చీత్కారాలు?

వరదలతో నిండా మునిగారు. బురదలతో నానా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు అధికార పార్టీలకు చెందిన ఒక్క నాయకుడు రాలేదు. కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఇప్పుడొస్తున్నారు. మళ్లీ అభివృద్ధి, సాయాన్ని పక్కనపెట్టి విద్వేశ పూరిత రాజకీయాలు చేయాలని నేతలు రెచ్చగొడుతున్నారు. కానీ జనాలు మాత్రం రెచ్చిపోవడం లేదు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. ప్రజల్లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం నేతల తీరుపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వారి రగులుతున్న అగ్నిపర్వతాలు ఇప్పుడు బద్దలవుతున్నాయి. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 10:50 am
    Follow us on

    Hyderabadis depressing TRS and MIM leaders

    వరదలతో నిండా మునిగారు. బురదలతో నానా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు అధికార పార్టీలకు చెందిన ఒక్క నాయకుడు రాలేదు. కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఇప్పుడొస్తున్నారు. మళ్లీ అభివృద్ధి, సాయాన్ని పక్కనపెట్టి విద్వేశ పూరిత రాజకీయాలు చేయాలని నేతలు రెచ్చగొడుతున్నారు. కానీ జనాలు మాత్రం రెచ్చిపోవడం లేదు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. ప్రజల్లో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం నేతల తీరుపై ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వారి రగులుతున్న అగ్నిపర్వతాలు ఇప్పుడు బద్దలవుతున్నాయి.

    Also Read: బండి సంజయ్ మరో దుమారం

    గ్రేటర్ లో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు సెగ తగులుతోంది. ఐదేళ్లు జీహెచ్ఎంసీలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏం చేశాయంటూ పలు చోట్ల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వరదలు, నష్టం, వరదసాయంపై టీఆర్ఎస్, ఎంఐఎం నేతలను ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తోంది. దీంతో నేతలకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. విశేషం ఏంటంటే ఎప్పుడూ మత ముద్ర వేసుకొని సెంటిమెంట్ రాజేసే ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ను కూడా తాజాగా ప్రజలు అడ్డుకొని తిడుతూ వెనక్కి పంపడం సంచలనంగా మారింది.

    ముషీరాబాద్ బోలక్ పూర్ లో చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం ఎదురైంది. ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన అక్బరుద్దీన్ ను స్థానిక ప్రజలు మాట్లాడనివ్వలేదు. ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు రాజకీయాలు వద్దు అని.. అభివృద్ధియే కావాలంటూ పెద్దగా నినాదాలు చేశారు. స్థానికులు తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి అక్బరుద్దీన్ వెళ్లిపోవడం విశేషం. ఎప్పుడు ఎంఐఎం నేతలు వచ్చినా పూలు జల్లే జనాలు ఈసారి రాళ్లు విసరడం చూస్తుంటే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేరే ఫలితాలు ఊహించవచ్చన్న అంచనాలు వస్తున్నాయి.

    ఇక తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి తరుఫున ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మారావును సైతం బస్తీ వాసులు అడ్డుకొని ‘వరదలు వచ్చినప్పుడు రాని నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావంటూ’ నిలదీసి ఆయనను పంపించి వేశారు.

    Also Read: న్యాయవ్యవస్థపై వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

    మొన్నటి వరదల్లో ముఖం చాటేసిన టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఇప్పుడు ఓట్ల కోసం కాలనీలకు వస్తుండడం జనం వారిని ముఖం మీదే నిలదీస్తున్నారు. ఉప్పల్ లో ఇటీవల ఓ మహిళ అయితే టీఆర్ఎస్ అభ్యర్థిని తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉప్పల్ టీఆర్ఎస్‌ అభ్యర్థి అరటికాయల శాలిని భాస్కర్‌ ముఖం మీదే తిట్టిపోసింది ఓ మహిళ.. ‘వరద సాయం పంచుకుతిన్నారు.. రూ. 25 లక్షలు.. రెండు గల్లీలకు చెందినవారే.. పెళ్లం, మొగుడు, కొడుకు ఇలా పంచుకుతిన్నారు. ఇక, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు’ అని ఆ మహిళ నిలదీసింది.. సాయం అందకపోతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సముదాయించే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయినా ఆ మహిళ వినకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు టీఆర్ఎస్‌ నేతలు.. ఇప్పుడా వీడియో టీఆర్ఎస్ పరువు తీస్తోంది.

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వారికి చీత్కారాలు తప్పడం లేదు. పలు చోట్ల నిలదీతలు ఎక్కువ అవుతున్నాయి. అసలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన హైదరాబాదీలు ఎన్నికల ప్రచారం కోసం తమ ముందుకు వస్తున్న అధికార, ప్రతిపక్ష నేతలను కాస్త గట్టిగానే నిలదీస్తుండడంతో నేతలంతా అవాక్కవుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్