https://oktelugu.com/

పూజా హెగ్డే.. అందుకే దూరం జరుగుతుంది !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే గుర్తుకువచ్చే పూజా హెగ్డే.. త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్ సినిమాల మీద మోజుతో టాలీవుడ్ అవకాశాలను కాదనుకుని రెండేళ్ళు పాటు ముంబైలోనే మకాం వేసిన పూజా హెగ్డే.. అప్పట్లో అక్కడ ఇక్కడ రెండిటికి అక్కర్లేని హీరోయిన్ గా మిగిలిపోయింది. కానీ, త్రివిక్రమ్ పుణ్యమా అని.. ఎన్టీఆర్ తో అరవింద సమేత, […]

Written By:
  • admin
  • , Updated On : November 25, 2020 / 07:19 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనగానే గుర్తుకువచ్చే పూజా హెగ్డే.. త్వరలోనే టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఒకసారి బాలీవుడ్ సినిమాల మీద మోజుతో టాలీవుడ్ అవకాశాలను కాదనుకుని రెండేళ్ళు పాటు ముంబైలోనే మకాం వేసిన పూజా హెగ్డే.. అప్పట్లో అక్కడ ఇక్కడ రెండిటికి అక్కర్లేని హీరోయిన్ గా మిగిలిపోయింది. కానీ, త్రివిక్రమ్ పుణ్యమా అని.. ఎన్టీఆర్ తో అరవింద సమేత, బన్నీతో అల వైకుంఠపురంలో అంటూ వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకుని.. మళ్ళీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

    Also Read: శ్రీముఖి పర్సనాలిటీపై సద్దాం సంచలన కామెంట్స్..!

    అన్నిటికిమించి ప్రస్తుతం నేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా ‘రాధేశ్యామ్’ పీరియాడికల్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవ్వబోతోంది. ఈ షెడ్యూల్ తో సినిమాలో పూజా పార్ట్ మొత్తం పూర్తవుంతుందట. ఇక ఈ సినిమాతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్.. పైగా ఈ సినిమాలో పూజా క్యారెక్టరే మెయిన్ గా ఉంటుందట. అయితే ఈ రెండు సినిమాల తర్వాత టాలీవుడ్ లో పూజా కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిట్ అవ్వలేదని తెలుస్తోంది.

    Also Read: బాపురే అనిపిస్తున్న మహేష్ క్రేజ్.. ఫ్యాన్స్ ఫిదా..!

    కాగా తెలుగు సినిమాలకు దూరం అవ్వడానికి పూజాకి బాలీవుడ్ మీద ఉన్న మోజునే కారణం అట. దీనికితోడు బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ సినిమాతో పూజా హెగ్డేకి ఫుల్ క్రేజ్ వచ్చింది. తను క్రేజీ హీరోయిన్ కాబట్టే బాలీవుడ్ లో వరసగా 3 పెద్ద ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం వచ్చిందని ఫీల్ అవుతుంది. రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ అనే సినిమాలో పూజానే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గాని హిట్ అయిందా… ఇక పూజా రేంజ్ ఆపడం అసాధ్యమే. ఎందుకంటే… పూజా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమాలో కూడా నటించబోతుంది. అలాగే మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి జంటగా కూడా ఒక సినిమా చేస్తోంది. అందుకే పూజా టాలీవుడ్ కు దూరం జరుగుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్