బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తరుచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా తలైవి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా రనౌత్.. తాజాగా కోర్టు పని తీరుని తప్పు పట్టింది. కోర్టు కూడా బెదిరిస్తుందని, దానిపై నమ్మకం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ మరణించిన సమయంలో నెపోటిజంపై కంగనా తీవ్ర విమర్శలు చేసింది. హృతిక్ రోషన్, రైటర్ జావెద్ అక్తర్ లను ఉద్దేశిస్తూ బాలీవుడ్ లో కోటరీ వ్యవస్థ చాలా బలంగా నాటుకుపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై రైటర్ జావెద్ అక్తర్ కంగనా రనౌత్ పై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసుకి సంబంధించి మాజరుకావాలంటూ ముంబైలోని అంధేరి మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కంగనకు ఫ్రిజవరి నుంచి పలుమార్లు సమన్లు జారీ చేశారు. ఎట్టకేలకు కంగనా హాజరైంది. బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకుండా కోర్టుకి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని పరోక్షంగా కోర్టు రెండు సార్లు తనను బెదిరించినందని తెలిపారు కంగనా.
ఈ కేసు దర్యాప్తు తనకు వ్యతిరేకంగా సాగుతుందని చెప్పిన కంగనా, ఈ కేసుని మరోకోర్టుకి బదలాయించాలని చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు రిక్వెస్ట్ చేశారు.