కులం నీకు ఏమిచ్చిదంటే.. ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతతోపాటు కొట్టుకోవడానికి చంపుకోవడానికి ఒక అస్త్రాన్ని ఇచ్చిందని కులవాదంపై కొందరు హేతువాదులు దెప్పిపొడుస్తుంటారు.. అసలు కులాలు లేని సమాజాన్ని చూడాలంటారు.. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తోంది.
Also Read: ఒక్క వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలు..
ఇప్పటికే ఏపీ సర్కార్ పై ‘హిందుత్వ’ మరకపడింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భావి భారత పౌరుల్లో కులమతాల జాఢ్యాలను తొలగించే పనికి శ్రీకారం చుట్టారు. ఏకంగా పాఠశాలల్లో కుల మతాల ప్రస్తావన తేకుండా మార్చేశారు.
ఈమేరకు జగన్ సర్కార్ రాష్ట్రంలోని స్కూల్క్ అటెండెన్స్ రిజిష్టర్ పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలను నమోదు చేయకుండా చూడాలని ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను ఆదేశించింది.
కొన్ని పాఠశాలల్లో కుల, మత వివరాలను స్కూల్ అటెండెన్స్ లో నమోదు చేస్తున్నారని సమాచారం రావడంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ స్పందించారు. ఈమేరకు ఇకపై స్కూల్ అటెండెన్స్ రిజిష్టర్లలో కుల, మత వివరాలను చేయవద్దని ఆదేశించారు. ఇప్పటికే ఎవరైనా నమోదు చేసి ఉన్నట్లయితే వాటిని తొలగించాలంటూ సర్క్యూలర్ జారీ చేశారు.
Also Read: ఉపాధి జాబ్ కార్డ్ పై దీపికా, జాక్వెలిన్ ఫోటోలు .. అవాక్కైన నెటిజన్లు..?
దీనిపై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ‘కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం.. పాఠశాల హాజరు రికార్డుల్లో విద్యార్థులు కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్.. ఎందరో మహాత్ములు కలలు కన్న కులమత రహిత సమాజానికి ఇది నాంది..’ అంటూ విజయసాయి ట్వీట్ చేశాడు.