జగన్ నే కాదు.. చిరంజీవిని వదలని మెగా బ్రదర్..!

జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటికి సొంతకుంపటి పెట్టుకున్న సంగతి తెల్సిందే. జీ టీవీలో ‘అదిరింది’ షో చేశారు. అయితే ఈ షో జబదర్దస్త్ ను బీట్ చేయలేకపోయింది. దీంతో ‘అదిరింది’ షోలో కొన్ని మార్పులు చేసి ‘బొమ్మ అదిరింది’తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ప్రసారమైన తొలి ఎపిసోడ్ ఏపీలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ షో అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. Also Read: బాలయ్యకి మంచి హీరోయినే దొరికింది ! […]

Written By: NARESH, Updated On : October 16, 2020 6:11 pm
Follow us on

జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు బయటికి సొంతకుంపటి పెట్టుకున్న సంగతి తెల్సిందే. జీ టీవీలో ‘అదిరింది’ షో చేశారు. అయితే ఈ షో జబదర్దస్త్ ను బీట్ చేయలేకపోయింది. దీంతో ‘అదిరింది’ షోలో కొన్ని మార్పులు చేసి ‘బొమ్మ అదిరింది’తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ప్రసారమైన తొలి ఎపిసోడ్ ఏపీలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ షో అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది.

Also Read: బాలయ్యకి మంచి హీరోయినే దొరికింది !

‘బొమ్మ అదిరింది’ షోలో ప్రసారమైన తొలి ఎపిసోడ్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై స్కీట్ చేశారు. జగన్ మ్యానరిజాన్ని రియాజ్ అనే పొట్టి వ్యక్తి ఇమిటేట్ చేశాడు. ఈ స్కిట్ మొత్తం నవ్వులజల్లులను పూయించింది. అయితే జగన్ అభిమానులు.. వైసీపీ నాయకులు మాత్రం ఈ స్కీట్ ను తప్పుబట్టారు. నాగబాబుపై.. షో నిర్వాహకులపై జగన్ అభిమానులు ఓ రేంజ్లో రెచ్చిపోయారు.

దీంతో నాగబాబు కూడా సదరు నాయకులపై సైటర్లు గుప్పించారు. కొందరు జనసేన అభిమానులు సైతం నాగబాబుకు మద్దతుగా జగన్ అభిమానులకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత ఈ స్కీట్లో వైఎస్ జగన్ గా చేసిన రియాజ్.. స్కీట్ రూపొందించిన హరిలు ఓ వీడియో సందేహంలో జగన్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం కొంతమేర చల్లారింది.

ఇక తాజాగా ‘బొమ్మ అదిరింది’లో నాగబాబు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని గెలికినట్లు కన్పిస్తోంది. వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో చిరంజీవిని ఇమిటేట్ చేసేలా ఓ స్కిట్ ప్లాన్ చేశారు. చిరు మ్యానరిజాన్ని సద్దాం ఇమిటేట్ చేశాడు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గెటప్‌లో వచ్చిన సద్దాం ఆ తరువాత చిరంజీవి ఖైదీ గెటప్‌లో వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చారు. ఖైదీలోని ఫైట్‌ను చిరు మ్యానరిజంతో కబడ్డీ చేస్తున్నట్లు వాడేశాడు. దీనికి నాగబాబు పగలబడి నవ్వుతూ కన్పించాడు

Also Read: వైరల్ అవుతోన్న ‘సుమ’ వీడియో !

సాధారణంగా నాగబాబు ముందు మెగా హీరోలను బ్యాడ్ గా చేసే సాహసం ఎవరూ చేయరు. అయితే ఈ షో కేవలం కామెడీ కోసమేనని.. ఎవరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దని చూపించేందుకే తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్కీట్ ను కామెడీగా చేసి చూపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘బొమ్మ అదిరింది’ షో నాగబాబు అనుకున్న దానికంటే కూడా వందరేట్లు పాపులర్ అయింది. దీంతో జీ యాజమాన్యం.. బొమ్మ అదిరింది షో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.