https://oktelugu.com/

వకీల్ సాబ్ ట్రైలర్.. ఈ సాయంత్రమే క్రేజీ అప్డేట్!

ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీమూవీ ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. స‌రిగ్గా ప‌క్షం రోజుల్లో థియేట‌ర్లో సంద‌డి చేయ‌బోతోందీ సినిమా. దీంతో.. సైలెంట్ గా ఉన్న ప్ర‌చారాన్ని త‌ట్టిలేపేందుకు సిద్ధ‌మైంది యూనిట్‌. ఈ మేర‌కు గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ అవుతోంది. నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి, ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈ వెంట్ కు ప్లాన్ గీశారు. ప‌వ‌న్ పున‌రాగ‌మ‌నానికి ధీటుగా ఈ వేడుక ప్లాన్ చేస్తున్నార‌ట […]

Written By:
  • Rocky
  • , Updated On : March 24, 2021 / 01:08 PM IST
    Follow us on


    ప‌వ‌ర్ స్టార్ రీ-ఎంట్రీమూవీ ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. స‌రిగ్గా ప‌క్షం రోజుల్లో థియేట‌ర్లో సంద‌డి చేయ‌బోతోందీ సినిమా. దీంతో.. సైలెంట్ గా ఉన్న ప్ర‌చారాన్ని త‌ట్టిలేపేందుకు సిద్ధ‌మైంది యూనిట్‌. ఈ మేర‌కు గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ అవుతోంది. నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి, ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు.

    ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈ వెంట్ కు ప్లాన్ గీశారు. ప‌వ‌న్ పున‌రాగ‌మ‌నానికి ధీటుగా ఈ వేడుక ప్లాన్ చేస్తున్నార‌ట దిల్ రాజు. కేవ‌లం ఈ ఈవెంట్ కే దాదాపు కోటి రూపాయ‌లు ఖ‌ర్చుచేయ‌బోతున్నార‌ట‌. అంతేకాదు.. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా రాబోతున్నార‌ట‌. వీరితో ప‌వ‌న్ కూడా వేదిక‌మీద క‌నిపిస్తే.. ఫంక్ష‌న్లో దుమ్ములేసిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

    ఇలా.. బ‌య‌టి ప్ర‌మోష‌న్ న‌డుస్తుండ‌గా.. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు కూడా త‌న ప‌ని మొద‌లు పెట్టాడు. వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసేందుకు ఆయ‌న ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి మూడు పాట‌లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ట్రైల‌ర్ ను కూడా లాంఛ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇవ్వ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది యూనిట్‌. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. అది ట్రైల‌ర్‌ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేటే అంటున్నారు. ఈ నెల 29న వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ ను లాంఛ్ చేస్తార‌ని తెలుస్తోంది.

    ఏప్రిల్ 9న వ‌కీల్ సాబ్ థియేట‌ర్లో మోత మోగించ‌బోతున్న విష‌యం తెలిసిందే. అంటే.. ఇంకా ప‌దిహేనురోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ గ్యాప్ లోనే ట్రైల‌ర్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్ తో ప్ర‌మోష‌న్ పీక్స్ కు తీసుకెళ్తేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్‌.