ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలు..?

నిరుద్యోగులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న రైల్వే శాఖ 182 అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. ఇంటర్ పాసైన అభ్యర్థులతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్ వివిధ ట్రేడ్ లలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..? https://dmw.indianrailways.gov.in/ […]

Written By: Navya, Updated On : March 25, 2021 10:23 am
Follow us on

నిరుద్యోగులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న రైల్వే శాఖ 182 అప్రెంటిస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. ఇంటర్ పాసైన అభ్యర్థులతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డీజిల్‌ లోకో మోడ్రనైజేషన్‌ వర్క్స్ వివిధ ట్రేడ్ లలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

https://dmw.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే శాఖ వరుసగా ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తోంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా హెటిరో డ్రగ్స్ లో జాబ్స్..?

మొత్తం 182 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్‌ ఖాళీలు 70 ఉండగా మెకానికల్‌ (డీజిల్‌) ఖాళీలు 40, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలు 32, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 23, వెల్డర్ ఉద్యోగ ఖాళీలు 17 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మెరిట్ తో పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

రైల్వే శాఖ రాబోయే రోజుల్లో మిగిలిన ఖాళీల భర్తీ కోసం కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్ల పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు