https://oktelugu.com/

టీజర్ టాక్: గుండెను తాకేలా ‘ఉప్పెన’ వచ్చింది

తొలిప్రేమ..ఎవరికైనా ఓ మధుర జ్ఞాపకం.. మరిచిపోలోనే విరహ గీతం.. ఆ విరహాన్ని అనుభవించేలా తీర్చిదిద్దారు ‘ఉప్పెన’ మూవీలో.. కరోనా లాక్ డౌన్ తో ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ కు ప్లాన్ చేసిన ‘ఉప్పెన’ మూవీ టీజర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు. Also Read: టీజర్ టాక్: గుండెను తాకేలా ‘ఉప్పెన’ వచ్చింది మెగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా,, కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఇదే ‘ఉప్పెన’ చిత్రంతో ఎంట్రీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2021 / 05:06 PM IST
    Follow us on

    తొలిప్రేమ..ఎవరికైనా ఓ మధుర జ్ఞాపకం.. మరిచిపోలోనే విరహ గీతం.. ఆ విరహాన్ని అనుభవించేలా తీర్చిదిద్దారు ‘ఉప్పెన’ మూవీలో.. కరోనా లాక్ డౌన్ తో ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ కు ప్లాన్ చేసిన ‘ఉప్పెన’ మూవీ టీజర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు.

    Also Read: టీజర్ టాక్: గుండెను తాకేలా ‘ఉప్పెన’ వచ్చింది

    మెగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా,, కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఇదే ‘ఉప్పెన’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు.. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ సాయం చేశారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సినిమాను డైరెక్ట్ చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ కలిసి సినిమాను నిర్మించారు.

    ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ప్రేక్షకుల హృదయాన్ని తాకగా.. ఇప్పుడొచ్చిన టీజర్ అంతకుమించి అనేలా ప్రేమ కావ్యాన్ని లిఖించింది. మెగా అభిమానులను ప్రేమలోకంలో విహరింపచేసేలా టీజర్ ఉంది.

    ముఖ్యంగా హీరోయిన్ కృతిశెట్టి ఈ సినిమా రిలీజ్ అయితే ఎందరు కుర్రాళ్లను నిద్రపోకుండా డిస్టబ్ చేస్తుందో అనేలా అందం, అభినయం, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసింది. వైష్ణవ్, కృతి మధ్య ప్రేమ సన్నివేశాలతో టీజర్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి.

    Also Read: జరిగిన తప్పిదం పై హీరోగారి వివరణ !

    సంక్రాంతి సందర్భంగా ‘ప్రేమలో మునిగి తేలండి’ అంటూ ‘ఉప్పెన’ టీజర్ ను చిత్రం యూనిట్ లాంచ్ చేసింది. ‘ఈ ఒక్కరాత్రి 80 సంవత్సరాలు గుర్తిండిపోయేలా బ్రతికేద్దాం’ అనడం ద్వారా సముద్రంలో వీరి విరహ వేదనను తీర్చేసుకున్నారని అర్థమవుతోంది. నడిసంద్రంలో లవర్ ను డ్రోన్స్ తో తీసిన షాట్స్ ఆకట్టుకున్నాయి. చివర్లో సముద్రం ఒడ్డున హీరో పడిపోయిన తీరు చూస్తే ఇది మరో ‘ఆర్ఎక్స్ 100’లా కనిపిస్తోంది. మరి పూర్తి సినిమా రిలీజ్ అయితేనే ఇది విషాదప్రేమ గీతికనా? కాదా అనేది తేలింది. ఇక హీరోయిన్స్ ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే కాదు.. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం.. నేపథ్యం సంగీతం టీజర్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్