Homeఎంటర్టైన్మెంట్మరో బయోపిక్.. ఆయన కాబట్టే ఒప్పుకుందట !

మరో బయోపిక్.. ఆయన కాబట్టే ఒప్పుకుందట !

Sumalatha Biopic
గత ఐదారేళ్ల నుండి అనుకుంటా.. అన్ని సినీ పరిశ్రమల్లోనూ బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన ప్రముఖుల జీవితం ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కించడం అనేది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలకు ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి, ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కా సింగ్’లతో పాటు ఇంకా కొన్ని జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్ లు వచ్చి, వారి వారి అభిమానులను అలరించాయి. ఇంకా అలరించడానికి మరికొన్ని బయోపిక్ లు రెడీ అవుతున్నాయి.

Also Read: టీజర్ టాక్: గుండెను తాకేలా ‘ఉప్పెన’ వచ్చింది

అయితే, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ… ఇలా అన్ని భాషల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకుంది ఎంపీ సుమలత. కాగా తాజాగా సుమలత జీవితం తెరపైకి రానుందని తెలుస్తోంది. ఆమె భర్త అంబరీష్‌ మృతి తర్వాత కర్నాటక రాష్ట్రంలోని మాండ్య నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, లోక్‌సభ సభ్యురాలిగా విజయం సాధించి.. రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్న సుమలత బయోపిక్‌ అంటే, ఒకరకంగా మంచి ఇంట్రస్ట్ ఉంటుంది. పైగా కెరీర్ మొదట్లో సుమలత కొన్ని ఇబ్బందులు కూడా పడిందట.

Also Read: జరిగిన తప్పిదం పై హీరోగారి వివరణ !

ఇంతకీ సుమలత బయోపిక్ ఎవరు తీస్తున్నారు అంటే.. కన్నడ దర్శక–నిర్మాత గురుదేశ్‌ పాండే. ఈయనకు సుమలత అంటే ప్రత్యేకమైన ఇష్టం అట. ఆమెతో ఓ సినిమా చేయడానికి ఈయన అప్పట్లో తెగ ప్రయత్నాలు చేశాడట. కానీ అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. భర్తకు దూరం అయ్యాక, సుమలతకు అండగా నిలబడుతూ అన్ని ఈయనే చూసుకుంటున్నాడని కూడా కన్నడనాట వార్తలు వస్తున్నాయి. బహుశా ఈయన కాబట్టే.. సుమలత తన బయోపిక్‌ కి అంగీకారం తెలిపి ఉంటుంది. ఇక ఆమె నట జీవితంతో పాటు రాజకీయ జీవిత ప్రయాణాన్ని బయోపిక్ లో హైలైట్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version