ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్సకత్వంలో రానున్న సినిమా ‘రెడ్’. సంక్రాంతి కానుకగా గురువారం రిలీజ్ అవుతోన్న ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను జరిపించారు. పైగా స్టార్ డైరెక్టర్ తివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చి.. స్రవంతి రవికిషోర్ కాళ్ళు పట్టుకుని మొత్తానికి ఈ ఈవెంట్ కి మంచి హైప్ తీసుకువచ్చాడు. అయితే, ఈ ఈవెంట్ లో జరిగిన చిన్న తప్పిదం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండటంతో దాని పై రామ్ వివరణ ఇచ్చాడు.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పూజ హెగ్డే !
ఇంతకీ ఏమి జరిగింది అంటే.. ఈ ఈవెంట్ లో రెడ్ సినిమా టికెట్‌కు బదులు క్రాక్ టికెట్ ను చిత్రబృందం ఆవిష్కరించింది. పైగా ఇది చేస్తూ బాగానే హడావుడి చేసింది ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా. ఇది గమనించిన నెటిజన్లు శ్రేయాస్ మీడియా పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. దాంతో రామ్ స్పందిస్తూ.. ‘రెడ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. ఎంతో కాలం తర్వాత అభిమానులను కలుసుకున్నందుకు ఎప్పటిలాగానే చాలా సంతోషంగా ఉంది. శ్రేయాస్ మీడియా.. అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. ఏమీ ఫర్వాలేదు. ఎప్పటికీ మీరే బెస్ట్’ అంటూ శ్రేయాస్ మీడియాకి రామ్ సపోర్ట్ చేయడంతో అందరూ హీరోగారి పెద్ద మనసును మెచ్చుకుంటున్నారు.
Also Read: రివ్యూ : మాస్టర్ – బోరింగ్ యాక్షన్ డ్రామా !
కరోనా మహమ్మారి దెబ్బకు ఎప్పుడో సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన రామ్ ‘రెడ్’ ఇలా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఎలాగూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న సినిమా కావడంతో, ఈ రెడ్ సినిమా పై మంచి హైప్ ఉంది. కాగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Trivikram garu – Thank you for making the event so memorable.🤗
My dearest fans – Loved seeing you all as always ❤️
Media – Thank you for your kind words & support 🙏@shreyasmedia – Appudappudu Thappulu Jaruguthayi..Em Parledhu..You’re still the best..cheers!👍
Love..#RAPO
— RAm POthineni (@ramsayz) January 13, 2021