దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం.. గురజాడ మాట గుర్తుచేసిన మోడీ

కరోనా కౌగిలి నుంచి జనాలు బయటపడే రోజులొచ్చాయి. దేశ ప్రజలందరికీ గుడ్ న్యూస్ అందింది. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియకు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10.30 గంటలకు దేశవ్యాప్తంగా ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ సమావేశంలో మోడీ ప్రారంభించారు. Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనిపించే లక్షణాలు ఇవే..? ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘దేశ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్ […]

Written By: NARESH, Updated On : January 16, 2021 3:05 pm
Follow us on

కరోనా కౌగిలి నుంచి జనాలు బయటపడే రోజులొచ్చాయి. దేశ ప్రజలందరికీ గుడ్ న్యూస్ అందింది. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియకు ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10.30 గంటలకు దేశవ్యాప్తంగా ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ సమావేశంలో మోడీ ప్రారంభించారు.

Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కనిపించే లక్షణాలు ఇవే..?

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘దేశ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. టీకా కోసం పనిచేసిన అందరికీ అభినందనలు.. ఏళ్లు పట్టాల్సిన టీకాను మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు.. వారి కృషి ఫలితమే రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయని మోడీ తెలిపారు. దేశీయ టీకా తయారీతో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందని మోడీ ప్రశంసించారు.

కరోనాపై యుద్ధంలో యావత్ భారతావణి కుటుంబంలా మారిందని.. సమైక్యతతో వైరస్ ను ఎదుర్కోగలిగామని మోడీ తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని మోడీ తెలిపారు. కరోనా పంపిణీలోనూ అదే ధైర్యం చూపాలని మోడీ అన్నారు.

ఇక మోడీ తన ప్రసంగంలో తేటతెలుగు పదఘట్టాలను వల్లెవేశారు. తెలుగు మహాకవి గురజాడ అప్పారావు కవిత ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అంటూ ప్రజలకు హితబోధగా వాడడం విశేషం. గురజాడ మాటలను ఆచరిస్తూ కరోనా పోరులో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని కొనియాడారు.

Also Read: పెళ్లిలో బోరున ఏడ్చేసిన పెళ్లికొడుకు.. కారణమేంటంటే..?

టీకా తీసుకోవడంలో వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులే తొలి హక్కుదారులని మోడీ అన్నారు. కరోనాను ఎదుర్కోనేందుకు రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. రెండు డోసులకు మధ్య నెలరోజులు సమయం ఉండాలని తెలిపారు. మొదటి డోసు వేసుకున్నవారు రెండో డోసును మర్చిపోవద్దని సూచించారు.

దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలిరోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి.. రెండో విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్