https://oktelugu.com/

ఆమె కెరీర్ లో అతి పెద్ద తప్పు అదేనట !

అన్ని ఇండస్ట్రీ హీరోయిన్లకి అలాగే ఉత్తరాది నుంచి వచ్చిన ముద్దుగుమ్మలందరికీ బాలీవుడ్ అనేది ఓ కలల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో చీకటి రొంపలు ఎదురైనా.. వాటన్నిటిని భరిస్తూ ఎలాగోలా ఆ ప్రపంచంలోనే తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి ఎదురుచూస్తుంటారు అందరూ భామలు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను కూడా వదులుకొని మొత్తానికి కెరీర్ ను నాశనం చేసుకుంటారు. టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాగా క్రేజ్-డబ్బు సంపాదిస్తున్నప్పటికీ చాలామంది హీరోయిన్ల చూపు ఎప్పుడూ హిందీ సినిమాలవైపే […]

Written By:
  • admin
  • , Updated On : January 16, 2021 / 02:24 PM IST
    Follow us on


    అన్ని ఇండస్ట్రీ హీరోయిన్లకి అలాగే ఉత్తరాది నుంచి వచ్చిన ముద్దుగుమ్మలందరికీ బాలీవుడ్ అనేది ఓ కలల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో చీకటి రొంపలు ఎదురైనా.. వాటన్నిటిని భరిస్తూ ఎలాగోలా ఆ ప్రపంచంలోనే తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి ఎదురుచూస్తుంటారు అందరూ భామలు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను కూడా వదులుకొని మొత్తానికి కెరీర్ ను నాశనం చేసుకుంటారు. టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. బాగా క్రేజ్-డబ్బు సంపాదిస్తున్నప్పటికీ చాలామంది హీరోయిన్ల చూపు ఎప్పుడూ హిందీ సినిమాలవైపే ఉంటుంది.

    Also Read: అది ఈ ముదురు భామకే సాధ్యం !

    సౌత్ లో స్టార్ హీరోలు ఆఫర్లు ఇచ్చినా వీళ్లకు తృప్తి ఉండదనే అనుకోవాలి. బాలీవుడ్ లో ఓ చిన్న సి-గ్రేడ్ సినిమాలోనైనా నటించేయాలని తెగ ఉబలాట పడుతుంటారు. ఇలా దూరపు కొండలు చూసి నునుపు అనుకునే హీరోయిన్లకు చివరకు మిగిలేది రాళ్లు రప్పలే. ఇలాంటి హీరోయిన్లకు కనువింపు కలిగించడానికి పూనుకొంది పాయల్ ఘోష్. ఊసరవెల్లి, ప్రయాణం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ అసలు రంగును బయటపెడుతూనే, టాలీవుడ్ ఎంత గొప్పదో చెబుతూ పనిలో పనిగా మిగిలిన హీరోయిన్లను కూడా ఎడ్యుకేట్ చేస్తూ ముందుకుపోతుంది.

    Also Read: నమ్రతా పోస్ట్ కు ఫీల్ అయిన రాజు !

    ముందుగా తన గురించే చెబుతూ.. బాలీవుడ్ కోసం టాలీవుడ్ ఆఫర్లు వదులుకొని నా కెరీర్ లో అతి పెద్ద తప్పు చేశానని, ఇక పై ఎవ్వరూ ఆ తప్పు చేయొద్దని అందరి హీరోయిన్లను వేడుకుంటుంది పాయల్. ముఖ్యంగా సౌత్ హీరోయిన్లంతే బాలీవుడ్ జనాలకు చాలా చులకన భావం ఉంటుందని.. సౌత్ హీరోయిన్లు దేనికైనా ఓకే అంటారనే భావన బాలీవుడ్ మేకర్స్ లో బాలంగా ఉందని.. అందుకే దయచేసి బాలీవుడ్ సినిమాల కోసం సౌత్ సినిమాలను వదులుకోవద్దు అంటూ పాయల్ చెప్పుకొచ్చింది. సౌత్ లో హీరోయిన్లకు గుళ్లు కడతారని, అదే బాలీవుడ్ లోనైతే చచ్చిపోయేంత వరకు అవమానిస్తూనే ఉంటారని ఆ మధ్య ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది పాయల్ ఘోష్.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్