https://oktelugu.com/

రామ్-లింగుస్వామి చిత్రంలో ‘ఉప్పెన’ బ్యూటీ.. మరో క్రేజీ ఆఫర్

ఉప్పెనతో ఊపేసిన చిన్నది మంచి ఆఫర్లు కొల్లగొడుతోంది. ఉప్పెన మూవీలో నటించిన హీరోయిన్ కృతిశెట్టి ఆ సినిమాతో కుర్రకారు మదిని దోచేసింది. ఆ సినిమా చూసిన చిరంజీవి, రాంచరణ్ సైతం కృతి స్టార్ హీరోయిన్ అవుతుందని.. ఆమె డేట్స్ కూడా దొరకవంటూ కితాబిచ్చారు. అన్నట్టుగా కృతి రెమ్యూనరేషన్ కోటికి చేరువై వరుసగా ఆఫర్లు సంపాదిస్తోంది. తాజాగా కృతి ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పక్కన హీరోయిన్ గా ఎంపికైంది. ఆవారా, పందెంకోడి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2021 / 02:30 PM IST
    Follow us on

    ఉప్పెనతో ఊపేసిన చిన్నది మంచి ఆఫర్లు కొల్లగొడుతోంది. ఉప్పెన మూవీలో నటించిన హీరోయిన్ కృతిశెట్టి ఆ సినిమాతో కుర్రకారు మదిని దోచేసింది. ఆ సినిమా చూసిన చిరంజీవి, రాంచరణ్ సైతం కృతి స్టార్ హీరోయిన్ అవుతుందని.. ఆమె డేట్స్ కూడా దొరకవంటూ కితాబిచ్చారు. అన్నట్టుగా కృతి రెమ్యూనరేషన్ కోటికి చేరువై వరుసగా ఆఫర్లు సంపాదిస్తోంది.

    తాజాగా కృతి ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పక్కన హీరోయిన్ గా ఎంపికైంది. ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన తమిళ ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా  తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఈ  ఊర మాస్  చిత్రం రూపొందిస్తున్నారు.

    ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ఈరోజు ప్ర‌క‌టించింది చిత్రం యూనిట్.

    రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా ఇది రాబోతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపోందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో  మాస్ చిత్రంగా ఇది రాబోతోంది.

    భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు.

    ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మిస్తుండగా.. ఎన్‌. లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు.

    కాగా లింగుస్వామి ఇదే కథను అల్లు అర్జున్ తో ద్విభాష చిత్రంగా తీద్దామని అనుకున్నా అది వర్కవుట్ కాలేదు. దీంతో హీరో రామ్ తో తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్నారు. మరి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ మూవీ ఏమేరకు ఆడుతుందో చూడాలి..