ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు హవాను ఎవరూ కాదనలేరు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్లో తన స్టామినా కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. నిర్మాతగా కథలను సెలక్ట్ చేయడంలో తన రూటే సెపరేట్ అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాల్లో.. మెజారిటీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడమే ఇందుకు కారణం. దీంతో.. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే.. అందులో విషయం ఉంటుందనే ముద్ర పడిపోయింది.
Also Read: రామ్-లింగుస్వామి చిత్రంలో ‘ఉప్పెన’ బ్యూటీ.. మరో క్రేజీ ఆఫర్
అయితే.. మంచి సినిమా తీసి కూడా విడుదల చేయలేని వాళ్లు దిల్ రాజును కలుస్తున్నారు. ఆయన సినిమా చూసి, నచ్చితే ప్రొసీడ్ అంటున్నారు. ఆ సినిమాకు తన బ్యానర్ యాడ్ చేసి థియేటర్లలోకి వదులుతున్నారు. ఈ వారం అలా వచ్చిన సినిమానే ‘షాదీ ముబారక్’.
ఈ సినిమాను దాదాపు మూడేళ్లు కష్టపడి నిర్మించాడు బుల్లితెర నటుడు సాగర్. విడుదల చేయాలంటూ దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సినిమా చూసిన ఆయన.. కొన్ని సజెన్స్ చేశారట. ఈ మేరకు రీషూట్ కూడా అయ్యింది. ఫైనల్ గా ఓకే అనుకున్న తర్వాత దిల్ రాజు బ్యానర్ పై రిలీజ్ అయ్యిందీ సినిమా.
ఈ మూవీ ఒరిజినల్ టాక్ ఏమంటే.. ఫస్ట్ బాగానే ఉందట. సెకండ్ హాఫ్ కూడా ఓ మాదిరిగానే ఉందట. ఇప్పుడున కండీషన్ ప్రకారం.. సరైన ప్రచారం లభిస్తే, ఈ మూవీ మంచి కలెక్షన్లు లభించేదనే మాట వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్‌లో రిలీజ్ అయినప్పటికీ.. ఆ స్థాయిలో ప్రమోషన్ చేయలేదు. కారణం ఏంటనేది తెలియదుగానీ.. రిలీజ్ చేశామంటే చేశామన్నట్టుగానే ఉన్నారు దిల్ రాజు.
Also Read: మహా సముద్రం ఫస్ట్ లుక్: క్రూరంగా కనిపిస్తున్న శర్వానంద్
దీనివల్ల ఈ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాలేదు. చాలా చోట్ల మొదటి రోజుతోనే సినిమా తీసేశారు. అయితే.. మంచి పబ్లిసిటీ గనక ఇచ్చిఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని, మంచి కలెక్షన్లు రాబట్టేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఇలా ఎందుకు జరిగిందన్నది ఆయనకే తెలియాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్