https://oktelugu.com/

వన్డే సిరీస్ పాయే..టీంఇండియా టీంలో అనూహ్య మార్పులు?

ఓడిపోతే కానీ మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తత్త్వం బోధపడలేదు మరీ.. ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఆడే నవదీప్ శైనీ, యజువేంద్ర చాహల్ లపై ఎక్కువ ప్రేమను చూపిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు వారినే టీంలోకి తీసుకున్నారు. వారిద్దరూ భారీగా పరుగులు ఇచ్చి వికెట్లు తీయకపోవడంతో టీమిండియా ఓడిపోయింది. కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. సిరీస్ కూడా కోల్పోవడంతో కోహ్లీ నిర్ణయాలు, ఎంపికలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2020 / 08:12 PM IST
    Follow us on

    ఓడిపోతే కానీ మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తత్త్వం బోధపడలేదు మరీ.. ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు ఆడే నవదీప్ శైనీ, యజువేంద్ర చాహల్ లపై ఎక్కువ ప్రేమను చూపిన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు వారినే టీంలోకి తీసుకున్నారు. వారిద్దరూ భారీగా పరుగులు ఇచ్చి వికెట్లు తీయకపోవడంతో టీమిండియా ఓడిపోయింది. కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. సిరీస్ కూడా కోల్పోవడంతో కోహ్లీ నిర్ణయాలు, ఎంపికలపై తీవ్ర దుమారం రేగింది.

    దీంతో నామమాత్రమైన మూడో వన్డేలో స్టాండ్ బైలుగా టీంలో ఉన్న దీపక్ చాహర్, నటరాజన్, కులదీప్ యాదవ్ లకు విరాట్ తప్పని పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. కానీ నవ్విన నాప చేనే పండినట్టు స్టాండ్ బై ఆటగాళ్లు పట్టుదలతో రాణించి ఆస్ట్రేలియాపై గెలిపించారు. ఇక్కడ విరాట్ తన వారనుకున్న నమ్మిన ఆటగాళ్లు ఆడకపోగా.. ఇతర ఫ్రాంచైజీ ఆటగాళ్లు బాగా రాణించడం విశేషం. తొలి మ్యాచ్ లోనే ఆరంగేట్రం చేసిన నటరాజన్ యార్కర్లతో సత్తా చాటి తనను తీసుకున్నందుకు న్యాయం చేశాడు.

    ఇక వన్డేల్లో ఓటమితో కోహ్లీ ఇప్పటికైనా జట్టు కూర్పుపై కసరత్తు చేస్తే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ ను చూస్తే బౌలర్లుగా చాహల్, నవదీప్ శైనీలను పక్కకు పెట్టాల్సిందే. వారి స్థానంలో దీపక్ చాహర్, నటరాజన్ టీట్వంటీలు ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం దక్కవచ్చు.

    ఇక వన్డేల్లో 5వ స్తానంలో రాణించని కేఎల్ రాహుల్ ను తనకు ఇష్టమైన ఓపెనింగ్ కు పంపే అవకాశం ఉంది. టీట్వంటీల్లో పంజాబ్ కెప్టెన్ గా రాహుల్ ఐపీఎల్ లోనే అత్యధిక పరుగులు చేశాడు. దీంతో అతడు ఓపెనర్ గా ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఐదో డౌన్ లో మనీష్ పాండే, సంజు శాంసన్ లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ఆడడం ఖాయమే.

    సూపర్ ఫామ్ లో ఉన్న వార్నర్ లేకపోవడం ఆస్ట్రేలియాకు మైనస్ గా మారింది. వన్డే టీంతోనే ఆస్ట్రేలియా టీట్వంటీలకు రెడీ అవుతోంది. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో కొత్తవారితో కళకళలాడుతున్న టీమిండియా ఎలా రాణిస్తుందనేది వేచిచూడాలి.