చిరంజీవిపై పవన్ షాకింగ్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర కామెంట్లు చేశారు. చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉంటే సీఎం అయ్యేవారని అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారం మనకు బాధ్యత అలంకారంకాదన్నారు. మేము వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఇక రైతుల గురించి మాట్లాడుతూ రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఈ కార్యక్రమా కార్యాచరణను […]
Written By:
, Updated On : December 3, 2020 / 08:05 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర కామెంట్లు చేశారు. చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉంటే సీఎం అయ్యేవారని అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారం మనకు బాధ్యత అలంకారంకాదన్నారు. మేము వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఇక రైతుల గురించి మాట్లాడుతూ రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఈ కార్యక్రమా కార్యాచరణను వెల్లడిస్తామన్నారు.