జనవరి 7 వరకు బ్రిటన్‌ ఫ్లైట్లు బంద్‌

బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఆ దేశం నుంచి ఇండియాకు చేరారు. దీంతో మన దేశం సైతం అలర్ట్‌ అయింది. ముందస్తుగా బ్రిటన్‌ ప్లైట్లను నిలిపివేసింది. అయితే.. ఈ నిషేధాన్ని మరికొంత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌‌దీప్‌సింగ్‌ పురీ వెల్లడించారు. ఆ […]

Written By: Srinivas, Updated On : December 30, 2020 4:24 pm
Follow us on


బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ అమల్లోకి తెచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ఆ దేశం నుంచి ఇండియాకు చేరారు. దీంతో మన దేశం సైతం అలర్ట్‌ అయింది. ముందస్తుగా బ్రిటన్‌ ప్లైట్లను నిలిపివేసింది. అయితే.. ఈ నిషేధాన్ని మరికొంత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌‌దీప్‌సింగ్‌ పురీ వెల్లడించారు. ఆ తర్వాత కఠిన ఆంక్షల నడుమ సేవల పునరుద్ధరణ ఉంటుందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్విటర్‌‌లో పేర్కొన్నారు.

Also Read: గణతంత్ర వేడుకల్లో భారీ మార్పులు

కొత్తరకం కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్‌–బ్రిటన్‌ మధ్య ఈనెల 23 నుంచి 31 వరకు విమాన సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల భారత్‌కు తిరిగివచ్చిన వారిలో పలువురికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు తేలడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. విమాన సర్వీసులను నిషేధాన్ని మరింత కాలం పొడిగించింది.

Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. విమానాన్ని తలపించేలా రైలు బోగీలు..?

మరోవైపు.. ఈనెల 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చి కరోనా పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించనుంది. మిగితా వారికి ఐసీఎంఆర్‌‌ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ టెస్టులు చేసి.. కొద్ది రోజుల పాటు వారిని పర్యవేక్షించనుంది.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

ఇదిలా ఉండగా.. అసలే చలికాలం కావడం.. మరోవైపు కొత్త స్ట్రెయిన్‌ కావడంతో భయం కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. ఇక దీనికితోడు కొత్త రకం కేసులు కూడా పెరుగుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటివరకు 20 మందికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు తేలింది. దీంతో వీరిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది.